- November 5, 2021
నేనైతే హ్యాపీగా పడుకుంటాను!.. యాంకర్ రష్మీ కామెంట్స్ వైరల్

యాంకర్ రష్మీ బుల్లితెరపై చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే రష్మీ తెరపై ఒక రకంగా ఉంటుంది. తెర వెనుక ఒక రకంగా ఉంటుంది. తెరపై ఎన్ని వేషాలు వేసినా, చిల్లర స్కిట్లో సెటైర్లు వేసినా, ట్రాకులు నడిపించినా అదంతా కూడా తెర వరకు మాత్రమే ఉంటుంది. అలాంటి రష్మీ తెర వెనుకలా ఎంతో బాధ్యతతో ఉంటుంది. సామాజిక సేవలు, మూగ జీవాల పరిరక్షణ, ప్రకృతి సంరక్షణ అంటూ పాటు పడుతూ ఉంటుంది రష్మీ.
ఎక్కువగా పార్టీలంటూ కూడా బయటకు వెళ్లదు. షూటింగ్‌లు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ అంటూ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అలాంటి రష్మీ పెట్స్ కోసం పరితపిస్తూ ఉంటుంది. పెట్స్‌కు ఎవరైనా హాని చేసినా, అవి ఒంటరిగా ఎక్కడైన గాయపడి ఉన్నా కూడా రష్మీ తల్లడిల్లిపోతోంది. ఇంటికి తెచ్చుకుంటుంది. వాటిని పెంచుకుంటుంది. రష్మీ ఇప్పుడు దీపావళి వైబ్రేషన్స్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా రష్మీ ఓ పోస్ట్ చేసింది.
ఇందులో రష్మీ దర్జాగా కారులో వెనక సీట్లో పడుకుంది. చాలా మంది కారు జర్నీ అంటే పడదు. కళ్లు తిప్పినట్టుగా, కడుపు తిప్పినట్టుగా అనిపిస్తుంది. అయితే అలాంటి వారంతా ఎవ్వరూ కారు ఎక్కరు. దాంతో మహారాణిలా దర్జాగా ఇలా కారులో పడుకుని వెళ్తాను.. పైగా ఇలా పడుకుని వెళ్తుంటే.. ఆ వ్యూ చూడటానికి ఎంతో బాగుంటుందని రష్మీ చెప్పుకొచ్చింది. రష్మీ షేర్ చేసిన ఈ ఫోటో, చేసిన కామెంట్ రెండూ కూడా వైరల్ అవుతున్నాయి.