• November 8, 2021

వాళ్లకి కూడా ఆ గతి పట్టాలి.. లోబోపై యాంకర్ రష్మీ ఫైర్

వాళ్లకి కూడా ఆ గతి పట్టాలి.. లోబోపై యాంకర్ రష్మీ ఫైర్

    యాంకర్ రష్మీ మూగజీవుల పట్ల ఎంతటి ప్రేమను కనబరుస్తుందో అందరికీ తెలిసిందే. జీవ హింస ఎక్కడ జరిగినా కూడా రష్మీ తట్టుకోలేదు. కోడి, కుక్క ఇలా ప్రతీ ఒక్క జంతువు గురించి రష్మీ ఆలోచిస్తుంటుంది. సంప్రదాయాల పేరిట మూగ జీవాలను హింసించడంపైనా రష్మీవ్యతిరేకం. అందుకే ఆ మధ్య మొహరం, సంక్రాంతి, బక్రీద్ పండుగల సమయంలో రష్మీ జీవ హింసకు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేసింది. అవి ఎంతగానో వివాదాస్పదంగా మారాయి.

    అయితే రష్మీ మాత్రం ఎప్పుడూ కూడా జంతువులు, అన్యంపుణ్యం తెలియని మూగ జీవాల పట్లే సానుభూతిని వ్యక్తం చేస్తుంటుంది. తాజాగా రష్మీ కంట ఎ వీడియో పడింది. మూములుగానే హైద్రాబాద్‌లో జరిగే సదర్ ఉత్సవాలకు ఎంతో డిమాండ్ ఉంటుంది. వారు తమ పౌరుషానికి ప్రతీకగా.. దున్నపోతులను పెంచుతారు. వాటిని తీసుకొస్తారు. ఆ ఉత్సవాల్లో దున్నపోతులను కొందరు హింసిస్తుంటారు కూడా. ఈ సారి సదర్ ఉత్సవాల్లో దున్నలు దుమ్ములేపేశాయి. మనషుల మీదకే ఎగబడ్డాయి.

    అలాంటి సదర్ ఉత్సవాలకు సంబంధించిన వీడియోపై రష్మీ స్పందించింది. అందులో లోబో కూడా ఉన్నాడు. లోబో, ఇంకో వ్యక్తి ఓ దున్నపోతును ముక్కుకు కట్టిన తాడును లాగుతూ.. దాన్ని ముందుకు నడిపించుకుంటూ పోయారు. దానిపై రష్మీ స్పందించింది. అలా ముక్కు పట్టి లాగితే కలిగే బాధను త్వరలోనే వారు అనుభవించాలని కోరుకుంటున్నాను.. వారికి కూడా త్వరలోనే ఆ గతే పట్టాలన్నట్టుగా రష్మీ కోరుకుంది. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    Leave a Reply