• August 19, 2025

ఆగస్ట్ 29న ‘త్రిబాణధారి బార్బరిక్’

ఆగస్ట్ 29న ‘త్రిబాణధారి బార్బరిక్’

    ఓ సినిమాను తెరకెక్కించడం కంటే సరైన రిలీజ్ టైం, కావాల్సినన్ని థియేటర్లను బ్లాక్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడమే గొప్ప విషయం. సరైన రిలీజ్ డేట్ దొరికి.. అనుకునన్ని థియేటర్లు లభిస్తే.. భారీ రిలీజ్ దక్కితే ఆ చిత్రానికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మంచి రిలీజ్ డేట్ కోసం చూసిన ‘త్రిబాణధారి బార్బరిక్’ టీం మూవీని ఆగస్ట్ 29న భారీ ఎత్తున విడుదల చేయనుంది.

    స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రను పోషించగా.. వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్ ఇలా అన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి.

    ఇక ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. విజువల్స్, ఆర్ ఆర్ ఇలా అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. మోహన్ శ్రీవత్స మేకింగ్, ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ సంగీతం ఇప్పటికే అందరిలోనూ ఆసక్తి పెంచేసింది. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మొదటి ప్రాజెక్ట్ అయినా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మించారు. ఇక ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయిన పాటలు అయితే శ్రోతల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా ఈ చిత్రానికి కుశేందర్ రమేష్ రెడ్డి అందించిన విజువల్స్ అందరినీ ఆశ్చర్య పరిచేలా ఉన్నాయి. బార్బరిక్ కాన్సెప్ట్ ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషన్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు.

    ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ ఆగస్ట్ 22న విడుదల కావాల్సి ఉంది. కానీ సరైన రిలీజ్ డేట్, కావాల్సినన్నీ థియేటర్లు లభించడం కోసం ఆగస్ట్ 29కి వాయిదా వేశారు. ఇక ఈ ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ ఆగస్ట్ 29న గ్రాండ్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.