- November 6, 2021
MEGA 154 : చిరు కోసం వచ్చిన దర్శకులు

మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాకు బాబీ దర్శకుడన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో భారీ చిత్రాలను నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్ చిరుతో జత కట్టింది. ఈ 154వ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు లాంఛనంగా జరిగాయి. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ డైరెక్టర్లలో చాలా మంది గెస్టులుగా వచ్చారు. చిరంజీవి అంటే ఇష్టముండే దర్శకులందరూ దాదాపు ఈ ఈవెంట్‌కు వచ్చేశారు.
శనివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కే రాఘవేంద్ర రావు, వివి వినాయక్, పూరి జగన్నాథ్, కొరటాల శివ, ఛార్మీ, హరీష్ శంకర్, శివ నిర్వాణ, బుచ్చి బాబు, బీవీఎస్ రవి, నాగ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కొరటాల శివ, హరీష్ శంకర్, మెహర్ రమేష్, బుచ్చి బాబు, శివ నిర్వాణ ఇలా అందరూ కలిసి స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. మొదటి షాట్‌కు వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా.. పూరి జగన్నాథ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తపు షాట్‌కు కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు.
నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. ఆర్థర్ ఏ విల్సన్ కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. నిరంజన్ దేవరమనే ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, సుష్మిత కొణిదెల క్యాస్టూమ్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. కథ, మాటలు బాబీ రాయగా.. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లేను అందించారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రచనా సహకారం అందించారు. రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయి.