- October 20, 2023
టైగర్ నాగేశ్వరరావు ట్విట్టర్ రివ్యూ.. అదే సినిమాకు మైనస్

రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. అక్టోబర్ 20 కోసం మాస్ మహారాజా ప్రేక్షకులు ఎంతో ఎదురుచూశారు. ఈ సారి రవితేజ ఇండియా వైడ్‌గా సౌండ్ చేస్తాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. టీజర్, ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో సినిమా మీద అందరికీ నమ్మకం ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు ఫుల్ పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. ఆల్రెడీ ప్రీమియర్లు, అదనపు షోలు, ఓవర్సీస్ నుంచి టాక్ కూడా వచ్చింది.
ఫస్ట్ హాఫ్ అయిపోయిందని, సినిమా అదిరిపోయిందని ట్వీట్లు కనిపిస్తున్నాయి. సాంగ్స్ బాగా లేవని, అది ల్యాగ్ అనిపించిందట. అదే ఈ సినిమాకు మైనస్ అని అంటున్నారు. జీవీ ప్రకాష్ కొట్టిన బీజీఎం అయితే వేరే లెవెల్లో ఉందని టాక్. రవితేజకు ఇది కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అవుతుందంట. అంత అద్భుతంగా సినిమాలో నటించాడట. స్టోరీ, స్క్రీన్ ప్లే నెక్ట్స్ లెవెల్లో ఉందంట.
టైగర్ సినిమాకు దాదాపు అంతా పాజిటివ్ టాకే కనిపిస్తోంది. ఈ హైప్ చూసి పోయేలా ఉన్నామని రవితేజ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరోసారి బాలయ్య మీద రవితేజ హిట్టు కొట్టేశామని అంటున్నారు. అంతా పాజిటివ్ కనిపిస్తోంది? ఇదేమైనా పెయిడా? అని ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మాస్ మహారాజా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. దసరాకు విన్ అయ్యామని సంబరపడుతున్నారు.
రవితేజకు మొదటి సారిగా ఫుల్ నెగెటివ్ రోల్ వచ్చిందని, పూర్తిగా డార్క్ కారెక్టర్ అదిరిపోయిందని అంటున్నారు. సినిమాలో రవితేజ పాత్రే హైలెట్ అని, స్క్రీన్ ప్లే బాగుందని, జీవీ ప్రకాష్ ప్లస్ అవుతాడని, వీఎఫ్ఎక్స్ కాస్త మైనస్ అయ్యేలా ఉందని, పాటలు డిస్టర్బ్ చేసినట్టుగా ఫీలింగ్ వస్తుందని అంటున్నారు.