- September 25, 2022
ఉత్కంఠభరితంగా సాగే ‘దారి’ ట్రైలర్
ప్రస్తుతం చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేదు. కంటెంట్ బాగుంటే సినిమాను జనాలు ఆదరిస్తున్నారు. అందుకే ప్రస్తుతం మేకర్లు కంటెంట్ మీద దృష్టి పెట్టారు. కంటెంట్ బేస్డ్ సినిమాలకు దక్కుతున్న ఆదరణ ఎంతోమంది నూతన దర్శకనిర్మాతలకు బలాన్నిస్తోంది. కొత్త కొత్త కథలను రాసుకొని వాటిని ప్రేక్షకుల మెప్పు పొందేలా రూపొందిస్తున్నారు. ఇదే బాటలో రాబోతున్న విలక్షణ కథాంశం ‘దారి’. ముందెన్నడూ చూడని స్టోరీ లైన్ ఎంచుకొని అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా కథ రాసుకొని దాన్ని ‘దారి’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ యు. సుహాష్ బాబు. నరేష్ మామిళ్ళపల్లి, మోహన్ ముత్తిరయిల్ నిర్మాతలుగా..ఎం.జి. ప్రేమ్ విఘ్నేశ్ లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో పరమేశ్వర్ హివ్రాలే, కళ్యాణ్ విట్టపు, సునీత సద్గురు, సాయి తేజ గోనుగుంట్ల, అభిరామ్ (క్రేజీ అభి) ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఇది వరకు విడుదల చేసిన దారి సినిమా కాన్సెప్ట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్లు విడుదల చేశారు.
104 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్.. ‘భూ ప్రపంచంలో ప్రతీ జీవికి ఏదో ఒక సమస్య.. అలానే ఈ కథలో కూడా.. మా సమస్యకి..కొలతలు లేవుగానీ రూపం మాత్రం ఉంది.. సమస్యను పట్టుకోవాలని ఒకరు.. సమస్యను తీర్చాలని ఇంకొకరు.. సమస్యను వెతుక్కుంటూ వెళ్లేది ఇంకొకరు.. సమస్యను తికమక పెట్టేది మరొకరు.. మా అందరి సమస్య ఒక్కటే.. పారిపోవడం, దాక్కోవడం లేదా ఎదురుతిరగడం.. మా సమస్య తీరిందో లేదో తెలియాలంటే.. మేం ఏ దారిలో వెళ్లామో తెలియాలి.. అది తెలియాలంటే మీరు మా దారికి రావాలి.. ఒకటి గుర్తు పెట్టుకోండి.. మీ సమస్యను తీర్చడానికి ఎవ్వరూ రారు.. ఆఖరికి దేవుడు కూడా’ అంటూ సాగే వాయిస్ ఓవర్, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, చేజింగ్ సీన్స్ అన్నీ కలిపి కొత్త అనుభూతిని ఇస్తాయి.
ఫిఫ్త్ హౌస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై యు. సుహాష్ బాబు దర్శకత్వంలో ఈ ‘దారి’ సినిమా రూపొందుతోంది. నరేష్ మామిళ్ళపల్లి, మోహన్ ముత్తిరయిల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని మేకర్లు ప్రకటించనున్నారు.
నటీనటులు: పరమేశ్వర్ హివ్రాలే, కళ్యాణ్ విట్టపు, సునీత సద్గురు, సాయి తేజ గోనుగుంట్ల, అభిరామ్ (క్రేజీ అభి)
సాంకేతిక వర్గం:
కథ, దర్శకత్వం: యు. సుహాష్ బాబు
బ్యానర్: ఫిఫ్త్ హౌస్ ప్రొడక్షన్
నిర్మాతలు: నరేష్ మామిళ్ళపల్లి, మోహన్ ముత్తిరయిల్
లైన్ ప్రొడ్యూసర్ : ఎం.జి. ప్రేమ్ విఘ్నేశ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దమ్ము రాజా కిషన్
పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు