- July 11, 2025
Today Movies : ఒకే రోజు 13 చిత్రాల సందడి.. బాక్సాఫీస్ వద్ద కళకళ

Today Releasing Movies ప్రతీ శుక్రవారం థియేటర్లోకి కొత్త చిత్రాలు వస్తూనే ఉంటాయి. ఇక ఈ జూలై రెండో వారంలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళీ భాషల్లో కొత్త చిత్రాల సందడి కనిపిస్తోంది. ఇలా అన్నింట్లో కలిపి దాదాపుగా 13 చిత్రాలు థియేటర్లోకి రాబోతోన్నాయి. తెలుగులో అయితే సుహాస్ హీరోగా ఓ భామ అయ్యో రామ చిత్రం రానుంది. దీంతో పాటుగా ఆర్కే సాగర్ ది 100 సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఇవే తెలుగులో మెయిన్ చిత్రాలు కానున్నాయి. ఇక ఓ చిన్న చిత్రం ధీర్ఘాయుష్మాన్ భవ అని మరొకటి థియేటర్లలో సందడి చేయనుంది. బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ వర్జిన్ బాయ్స్ చిత్రం కూడా ఆడియెన్స్ ముందుకు రానుంది.
తెలుగులో కాకుండా ఇతర భాషల్లో చూసుకుంటే ఇంగ్లీష్‌లో సూపర్ మేన్.. హిందీలో మాలిక్, ఆంఖోంకి గుస్తాకియాన్ అనే చిత్రాలు రానున్నాయి. అదే తమిళంలో చూసుకుంటే ఓ ఎంథిరన్ బేబీ, దేసింగు రాజా 2, ఫ్రీడమ్, మాయాకుత్తు, మిస్టర్స్ అండ్ మిస్టర్ చిత్రాలు రానున్నాయి. ఇక అదే మలయాళంలో అయితే సూతరవక్యం, కోలాహలం అనే చిత్రాలు సందడి చేయనున్నాయి.