- November 20, 2022
” టాప్ గేర్ ” చిత్రం నుంచి ఈ నెల 25 న విడుదల కాబోతున్న ఫస్ట్ సింగిల్ ‘ వెన్నెల వెన్నెల
వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఇప్పుడు మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పలు యాక్షన్ సినిమాల ద్వారా మంచి విజయాలను అందుకోగా ఇప్పుడు ఈ సినిమా తో మరో విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా తాజాగా ఈ సినిమాలోని పాట విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘వెన్నెల వెన్నెల’ పాటను ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్డేట్స్ ప్రేక్షకులను అలరించగా ఈ సినిమా ను శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో K. V. శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రలలో నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాకథనాలతో రాబోతున్న ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను అలరించబోతుంది.
నటీనటులు
ఆది సాయి కుమార్, రియా సుమన్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ తదితరులు
టెక్నీషియన్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.శశికాంత్
సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్
మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: రామాంజనేయులు
కాస్ట్యూమ్ డిజైనర్: మాన్వి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి
ప్రొడ్యూసర్: K. V. శ్రీధర్ రెడ్డి
బ్యానర్: శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్
ప్రెజెంట్స్: ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్
పీఆర్వో: సాయి సతీష్, పర్వతనేని