- January 12, 2024
పాయల్ రాజ్‌పుత్, అనసూయ చేతుల మీదుగా తంత్ర ఫస్ట్ సాంగ్ ధీరే ధీరే రిలీజ్

అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశి మరియు మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా- ‘తంత్ర’. ఫస్ట్ కాపీ మూవీస్ మరియు బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు పి, రవిచైతన్య నిర్మాతలుగా, శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ : గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్ కి చాలా మంచి స్పందన లభించింది. తర్వాత టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ, డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిస్తోంది. అతి త్వరలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. ట్రైలర్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ రివీల్ అవుతాయి. మా ప్రొడ్యూసర్స్ నరేష్ బాబు మరియు రవిచైతన్య ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అడిగింది వెంటనే ఏర్పాటు చేస్తూ చాలా బాగా సహకరించారు. గతంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన అనురాగ్ కులకర్ణి గారు ఈ సాంగ్ పాడడం సాంగ్ కి చాలా ప్లస్ అయ్యింది. ఎంతో బిజీగా ఉన్నా కూడా అడగగానే కాదనకుండా ఈ సాంగ్ రిలీజ్ చేసిన పాయల్ రాజ్‌పుత్ గారికి, అనసూయ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు దర్శకుడు తెలియజేసాడు.
Happy to launch “Dheere-Dheere” song from @TantraTheMovie making visuals 😊 Very breezy and authentic! Best wishes to the entire team @AnanyaNagalla @srini_gopisetti @rrdhruvan @anuragkulkarni_ @veerapanenisc #DheereDheere #TantraFilm #AnasuyaBharathwajWishes #AnanyaNagalla… pic.twitter.com/BLpkZmdBSQ
— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 12, 2024
ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ : ఫస్ట్-లుక్, టీజర్‌కి వస్తున్న ఆదరణ మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ఇలాగే ప్రేక్షకుల ఆదరణ మా తంత్ర సినిమా పైన, మా పైన ఉండాలని.. సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ సాంగ్ రిలీజ్ చేసిన పాయల్ రాజ్‌పుత్, అనసూయ గార్లకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నటీనటులు :
అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశి, మీసాల లక్ష్మణ్, కుషాలిని, మనోజ్ ముత్యం, శరత్ బరిగెల
టెక్నీషియన్స్ :
రచన మరియు దర్శకత్వం : శ్రీనివాస్ గోపిశెట్టి
నిర్మాణం: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరి
నిర్మాతలు : నరేష్ బాబు పి, రవి చైతన్య
సహ నిర్మాత : తేజ్ పల్లి
డిఓపి : సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల
ఆర్ట్ డైరెక్టర్: గురుమురళీ కృష్ణ
ఎడిటర్ : ఎస్ బి ఉద్ధవ్
మ్యూజిక్ : ఆర్ ఆర్ ధృవన్
సౌండ్ డిజైన్: జ్యోతి చేతియా
సౌండ్ మిక్సింగ్: శ్యామల్ సిక్దర్
VFX: ఎ నవీన్
DI కలరిస్ట్: పివిబి భూషణ్
సాహిత్యం: అలరాజు
పి ఆర్ ఓ : మధు VR