• January 20, 2022

Supritha Marriage : యస్ చెప్పేశా.. పెళ్లికి రెడీ అయిన సుప్రిత!.. సురేఖా వాణి అల్లుడు ఇతడేనా?

Supritha Marriage : యస్ చెప్పేశా.. పెళ్లికి రెడీ అయిన సుప్రిత!.. సురేఖా వాణి అల్లుడు ఇతడేనా?

    Surekha Vani Daughter Supritha Marriage షీ సెడ్ యస్ (She Said yes), ఐ సెడ్ యస్ (I Said yes)అనే పదాలు ఈ మధ్య బాగానే ట్రెండ్ అవుతోన్నాయి. ఆ మధ్య రానా తన ప్రేయసి మిహికా ఓకే చెప్పింది అని అందరికీ ప్రకటించాడు. షీ సెడ్ యస్ (She Said yes) అని మిహిక ఫోటోను రానా షేర్ చేశాడు. దీంతో రానా మిహికల బంధం ఒక్కసారిగా అందరికీ అర్థమైంది. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే చేసుకోబోతోన్నారని తెలిసింది.

    అయితే ఇప్పుడు అదే పద్దతిలో సుప్రిత కూడా ఓ పోస్ట్ చేసింది. ఐ సెడ్ యస్ (I Said yes) అంటూ ఓ పోస్ట్ చేసింది. అందులో సుప్రిత ఓ వ్యక్తితో ఎంతో క్లోజ్‌గా ఉంది. ఇద్దరూ హగ్స్ చేసుకుంటూ కనిపించారు. ఇక సుప్రిత పెళ్లికి రెడీ అయిందని అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఇందులోనే అసలు ట్విస్ట్ ఉందని అర్థమవుతోంది.

    ఈ మధ్య ఇలాంటి పోస్ట్‌లు చేయడం, తమ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కొత్త ప్రాజెక్ట్‌ల గురించి ప్రమోషన్స్ చేసుకోవడం అందరికీ అలవాటైందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుప్రిత కూడా ఇలాంటి స్ట్రాటజీస్ వాడుతోందని నెటిజన్లు అంటున్నారు. అయితే ఇందులో ఏది నిజం ఏది అబద్దం అన్న విషయాలు మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టం.

    మొత్తానికి సుప్రిత మాత్రం కొత్త అడుగు వేసింది. అది జీవితంలో పెళ్లి అయినా సరే.. కొత్తగా వెబ్ సిరీస్, సినిమాలు అయినా సరే. అది సుప్రిత కొత్త అడుగే అవుతుంది. ఇక ఒక వేళ అది ప్రేమ విషయమే అయితే.. సురేఖా వాణికి అల్లుడు దొరికేసినట్టే. ఇక ఇన్ని రోజులు తల్లీకూతుళ్లు కలిసి తిరిగారు. ఇక ఇప్పుడూ మూడో వ్యక్తి కూడా జాయిన్ అవుతాడన్న మాట.

    Leave a Reply