• November 20, 2021

Pushpa: ‘పుష్ప’ ప్యాన్ ఇండియా సినిమానా?.. పరువు తీసిన సుప్రియ

Pushpa: ‘పుష్ప’ ప్యాన్ ఇండియా సినిమానా?.. పరువు తీసిన సుప్రియ

    Pushpa హీరోయిన్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ గురించి అందరికీ తెలిసిందే. అక్కినేని ఫ్యామలీ నుంచి వచ్చిన సుప్రియ మొదటగా హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ పక్కన నటించింది సుప్రియ. ఆ తరువాత హీరోయిన్‌గా సినిమాలను తీయలేదు. చివరగా గూఢచారి సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించింది

    అయితే నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది సుప్రియ. ఇప్పుడు ఆమె అనభవించు రాజా సినిమాతో బిజీగా ఉంది. ఆమె నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 26న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సుప్రియ మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే త్వరలో రిలీజ్ కాబోతోన్న సినిమాల గురించి కామెంట్ చేసింది.

    పుష్ప డిసెంబర్‌లో వస్తుందా? పుష్ప ప్యాన్ ఇండియా సినిమానా? అంటూ ఏమీ తెలియనట్టుగా సినిమా పరువుతీసింది. అది డిసెంబర్‌లో ఎలా వస్తుందండి.. ఒక్క భాషల్లో డబ్బింగ్ పనులు చేసేందుకు దాదాపు ఒక్క రోజు పడుతుంది. అలా ఏడు భాషల్లో అంటే ఎలా అవుతుంది. పుష్ప సినిమా డిసెంబర్‌లో ఎలా వస్తుందంటూ సెటైర్లు వేసింది సుప్రియ.

     

    Leave a Reply