- January 9, 2022
Ramesh Babu Death : మహేష్-రమేష్ బంధం.. సూపర్ స్టార్ కృష్ణ మాటల్లో

Mahesh Babu-Ramesh Babu మహేష్ బాబు రమేష్ బాబు బంధం గురించి సూపర్ స్టార్ కృష్ణ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మామూలుగా అయితే రమేష్ బాబు హీరోగా అంతగా సక్సెస్ అవ్వలేదు. కానీ మహేష్ బాబు మాత్రం టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తోంది మహేష్ బాబు అని చెప్పొచ్చు. అయితే ఈ అన్నదమ్ముల మధ్య ఉండే బంధం గురించి కృష్ణ గొప్పగా చెప్పుకొచ్చారు.
రమేష్ బాబుకు ఎక్కువగా ఫోకస్‌లో ఉండటం, మీడియా ముందుకు రావడం ఇష్టముండదు. ఇక మహేష్ బాబు అయితే అన్న ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటాడని, రమేష్ బాబు సినిమా చేస్తాను అంటే మహేష్ బాబు ఎప్పుడూ రెడీగా ఉంటాడని కృష్ణ పేర్కొన్నారు. ఫైనాన్షియల్‌గా తక్కువ కాకుండా ఉండేందుకు సినిమాల్లో పార్ట్నర్‌షిప్ కూడా ఇస్తాడు అని కృష్ణ తెలిపారు.
అర్జున్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు.. అందుకే దూకుడు సినిమాకు ప్రజెంటర్‌గా పెట్టుకున్నాడు అంటూ రమేష్ బాబు, మహేష్ బాబుల బంధం గురించి కృష్ణ చెప్పుకొచ్చాడు. అయితే మహేష్ బాబు మాత్రం అన్నను కడసారి చూసుకునేందుకు కూడా నోచుకోలేకపోయాడు. కరోనాతో మహేష్ బాబు క్వారంటైన్‌కు పరిమితమయ్యాడన్న సంగతి తెలిసిందే.