• August 15, 2024

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ‘డియర్ ఉమ’.. ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్టిల్‌తో ఆకట్టుకుంటున్న సుమయా రెడ్డి

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ‘డియర్ ఉమ’.. ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్టిల్‌తో ఆకట్టుకుంటున్న సుమయా రెడ్డి

    తెలుగమ్మాయి హీరోయిన్‌గా, నిర్మాతగా ఒకే సారి ఒక సినిమాకు పని చేయడం అంటే మామూలు విషయం కాదు. అనంతపురం నుంచి వచ్చిన అచ్చమైన, స్వచ్చమైన తెలుగమ్మాయి సుమయా రెడ్డి ప్రస్తుతం ఇండస్ట్రీలో తన సత్తాను నిరూపించుకునేందుకు రెడీగా ఉన్నారు. నిర్మాతగా, హీరోయిన్‌గా, కథా రచయితగా ‘డియర్ ఉమ’ చిత్రంతో సుమయా రెడ్డి టాలీవుడ్‌కు పరిచయం కానుంది. ఈ చిత్రానికి సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్, టీజర్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

    ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ఆడియెన్స్‌లో అంచనాలు పెంచేసింది. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడబోతున్నామని అందరిరకీ అర్థమైంది. ఈ మూవీతో కథా రచయితగా సుమయా రెడ్డి తన అభిరుచిని చాటుకునేలా ఉన్నారు. తాజాగా సుమయా రెడ్డి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇలా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా టీం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నామని ప్రకటించారు.

    నిర్మాతగా సుమయా రెడ్డికి ఇది మొదటి చిత్రమే అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో రిచ్‌గా నిర్మించారు. ఈ సినిమాలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి రధన్ సంగీతమందించారు.