• April 18, 2025

డియర్ ఉమ రివ్యూ.. వైద్యరంగంపై అవగాహన కల్పించే చిత్రం

డియర్ ఉమ రివ్యూ.. వైద్యరంగంపై అవగాహన కల్పించే చిత్రం

    ఓ తెలుగమ్మాయి హీరోయిన్‌గా తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టడం అంటేనే చాలా కష్టం. అయితే హీరోయిన్‌గానే కాకుండా రచయితగా, నిర్మాతగా, హీరోయిన్‌గా సుమయ రెడ్డి డియర్ ఉమ సినిమాతో ఆడియెన్స్ ముందుకు నేడు (ఏప్రిల్ 18) వచ్చింది. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌ మీద తీసిన డియర ఉమ సినిమా కథ ఏంటో ఓ సారి చూద్దాం.

    ప్రాణాలు కాపాడే డాక్టర్ అవ్వాలని ఉమా (సుమయ రెడ్డి) పల్లెటూరు నుంచి సిటీకి వస్తుంది. ఆయుష్ మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అవుతుంది. మరోవైపు దేవ్ (పృథ్వీ అంబర్) రాక్ స్టార్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రేమలో విఫలం అవ్వడంతో తాగుడుకు బానిసై దేని మీదా కాన్సర్టేట్ చేయలేక పోతాడు. దేవ్ చెడిపోతోన్నాడని ఆగ్రహం వ్యక్తి చేసి అతని తండ్రి ఇంట్లోంచి గెంటేస్తాడు. అక్కడా ఇక్కడా కష్టపడుతున్న దేవ్‌కి ఓ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో గుండెకు గాయం అవుతుంది. ఉమ చదువుతున్న ఆయుష్ హాస్పిటల్లోనే దేవ్‌ని జాయిన్ చేస్తారు. అదే హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌గా ఉమ పనిచేస్తుంది. అక్కడే దేవ్ అన్నయ్య సూర్య (కమల్ కామరాజ్) కూడా అడ్మినేస్ట్రటర్ కూడా పని చేస్తాడు. అయితే ఆ హాస్పిటల్ నుంచి దేవ్ డిశ్చార్జ్ అయిన తరువాత ఆర్ట్ గ్యాలరీలో పని చేస్తుంటాడు. ఆ టైంలోనే ఉమతో దేవ్‌కి పరిచయం ఏర్పడుతుంది. ఉమతో కొన్ని రోజుల ప్రయాణం తర్వాత దేవ్ ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. దేవ్ తెలుసుకున్న నిజం ఏంటి?.. అసలు ఉమకి ఏమైంది?.. ఉమ కోసం దేవ్ ఏం చేశాడు? అన్నది కథ.

    వైద్య వ్యవస్థలోని , వైద్యరంగంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాన్ని బయట పెట్టేలా డియర్ ఉమ చిత్రం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని మలిచారు. అందరికి అవగాహన కల్పించేలా.. అందరికీ మంచి సందేశాన్ని ఇచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి సందేశాత్మక చిత్రంగా డియర్ ఉమర్ సినిమాను అందరిని ఆకట్టుకునేకించడంలో దర్శకుడు సాయిరాజు సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు.

    ఈ సినిమాకు ప్రధానంగా రధన్ సంగీతం మనకు మేజర్ సెట్ అని చెప్పొచ్చు. రాజ్ తోట కెమెరావర్క్ ఎంతో సహజంగా ఉంది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే హైలైట్ అని చెప్పొచ్చు. అందర్నీ షాక్ గురి చేసేలా ఇంటర్వెల్, క్లైమాక్స్ పోర్షన్ ఏమో చాలా ఎమోషనల్‌గా రాసుకుని అందరినీ ఆకట్టుకున్నారు. పతాక సన్నివేశంలో వచ్చే పాట ఈ సినిమా నుంచి చెప్పాల్సిన సందేశాన్ని చెప్పేస్తుంది. క్లైమాక్స్ ఓ సంతృప్తిని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది.

    ఉమ పాత్రలో సుమయ రెడ్డి చక్కగా నటించింది. ఇక నిర్మాతగా, రచయితగా, నటిగా సుమయ రెడ్డి తన వంతు న్యాయం చేసింది. అందరినీ కదిలించే, అవగాహన కల్పించే, మేల్కొపే కథను రాయడంలో సుమయ సక్సెస్ అయింది. ఎమోషన్స్ పలికించడంలో, తెరపై అందంగా కనిపించడంలోనూ సుమయ రెడ్డి తన మార్క్ వేసింది. హీరోగా పృథ్వీ అంబర్ యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించాడు. కమల్ కామరాజ్ యాక్టింగ్ బాగుంటుంది. అజయ్ ఘోష్ పాత్ర మెప్పిస్తుంది. ఫైమా, లోబో, సప్తగిరి, భద్రం పోషించిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి.

    రేటింగ్ : 3