- November 16, 2025
దటీజ్ సుమ.. ఆమె ఉంటే చాలంతే

సుమ స్టేజ్ మీద ఉందంటే.. చిత్రయూనిట్ హాయిగా, నిశ్చింతగా ఉండొచ్చు. అది మరొకసారి రుజువైంది. గ్లోబ్ ట్రోట్టర్ అనే ఈవెంట్‌ను అంతర్జాతీయంగా అందరూ వీక్షించిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ నుంచి కూడా మీడియా ఇక్కడకు వచ్చింది. ఇలాంటి ఓ అంతర్జాతీయ ఈవెంట్‌ను సుమ తన భుజాలపై అవలీలగా మోసేసింది. వచ్చిన మహేష్ బాబు అభిమానుల్ని ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. మహేష్ బాబుని కడుపుబ్బా నవ్విస్తూనే ఉంది. అలా మహేష్ నవ్వులకు, అభిమానుల కేరింతలు తోడై ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది.
మధ్యలో టెక్నికల్ ఇష్యూ వచ్చి టీజర్ ప్లే కాలేకపోతే.. స్టేజ్ మీద నిల్చుని ఎంటర్టైన్ చేసింది. ఏ చిన్న గ్యాప్ వచ్చినా కూడా తన హోస్టింగ్‌తో అది కవర్ చేసింది. నిన్న ఎన్ని అడ్డంకులు వచ్చినా సుమ మాత్రం వాటికి అడ్డుగా నిలబడి ఈవెంట్‌ను సక్సెస్ చేసింది. నిన్న ఈవెంట్ మొత్తంలో సుమ ప్రధానంగా హైలెట్ అయిందని చెప్పుకోవచ్చు. అందుకే స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరూ కూడా సుమ డేట్ కోసం ఎదురుచూస్తుంటారు. ఆమె అందుబాటులో ఉంటేనే ఈవెంట్లను ప్లాన్ చేసుకుంటారని నిన్నటి ఘటనతో మరోసారి ఫ్రూవ్ అయింది.