• October 29, 2021

మొత్తానికి ఆ విషయం బయటపెట్టేసుకున్నారుగా?.. జోరు మీదున్న రష్మీ, సుధీర్

మొత్తానికి ఆ విషయం బయటపెట్టేసుకున్నారుగా?.. జోరు మీదున్న రష్మీ, సుధీర్

    రష్మీ సుధీర్ బుల్లితెరపై ఎంతటి క్రేజ్‌ను సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరి ఎవరు వాడుకున్నారు.. ఎవరి వల్ల ఎవరికి ఎక్కువగా పేరు వచ్చిందన చర్చ పక్కన పెట్టేస్తే.. ఇద్దరూ ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నారు. బుల్లితెరపై మంచి డిమాండ్ ఉన్న స్టార్స్‌లో రష్మీ సుధీర్ ఉంటారు. ఈ ఇద్దరూ కలిసి వస్తే ఏ ఈవెంట్ అయినా సరే అదిరిపోతోంది. ఈ ఇద్దరూ ఈవెంట్లో ఉంటే చాలు అన్నంతగా ఫేమస్ అయ్యారు.

    అలా రష్మీ సుధీర్ కలిసి షోలు, ఈవెంట్లు ఫుల్ హిట్ అవుతుంటాయి. వారిద్దరి మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీని జనాలు ఎప్పటికీ ఇష్టపడుతూనే ఉంటారు. అయితే తాజాగా ఢీ షోలో ఇద్దరూ మాట్లాడుకుంటూ కొన్ని పర్సనల్ విషయాలను బయపెట్టేసుకున్నారు అసలే ఈ ఇద్దరూ రెమ్యూనరేషన్ల పరంగానే హై స్థాయిలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఒక్కో ఎపిసోడ్‌కే లక్షలు వసూళ్లు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరూ తమ జీవితంలో ముందడగు వేసినట్టు కనిపిస్తోంది

    సుధీర అద్భుతమైన ఇళ్లు కడుతున్నట్టు తెలుస్తోంది. విలాసవంతమైన ఇంటిని సుధీర్ కడుతున్నాడని రష్మీ చెప్పేసింది. ఇక రష్మీ ఓ లగ్జరీ కారు కొనేసిందని సుధీర్ చెప్పేశాడు. మొత్తానికి ఇద్దరూ అలా తమకు సంబంధించిన మంచి విషయాలను బయపపెట్టేసుకున్నారు. ఢీ షోలో ఈ తతంగం అంతా జరిగింది. వచ్చే వారం రాబోతోన్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా వచ్చింది. అందులో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇక నువ్ పార్టీ ఇవ్వు అంటే నువ్ పార్టీ ఇవ్వు అని ఇద్దరూ వాదులాడుకున్నారు.

    నా ఇళ్లు ఇంకా ఓపెన్ కాలేదు.. కానీ నువ్ మాత్రం కారు కొనేశావ్ కాబట్టి నువ్వే ముందు పార్టీ ఇవ్వాలని సుధీర్ అంటాడు. గృహ ప్రవేశం అయితే అయింది కదా? పార్టీ ఇవ్వు అని రష్మీ అంటుంది. ఎన్నో ప్రవేశాలు చేశాడు అంటూ ఆది కౌంటర్ వేయడంతో అందరూ నవ్వేశారు.

    Leave a Reply