- April 7, 2023
Sreeleela: ఓటీటీలో ఆకట్టుకుంటోన్న శ్రీలీల కొత్త చిత్రం

ప్రస్తుతం శ్రీలీలకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్, డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె లక్కీ హ్యాండ్‌గా మారిపోయారు. ఆమె నటించిన సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ అవుతున్నాయి. విరాట్ శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఐ లవ్ యు ఇడియట్’ సినిమా ఇప్పుడు ఆహాలో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న థియేటర్లోకి వచ్చి మంచి సక్సెస్‌ను సాధించింది. ఇప్పుడు ఈ సినిమా భవానీ మీడియా సంస్థ ద్వారా ఆహాలోనూ సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.
అవిరుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీమతి బత్తుల వసంత సమర్పణలో ఎపి అర్జున్ దర్శకత్వంలో సాయి కిరణ్ బత్తుల, సుదర్శన్ గౌడ్ బత్తుల, ఎపి అర్జున్ నిర్మాతలుగా ఈ సినిమా వచ్చింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అవ్వడం, శ్రీలీల అందాలు, డ్యాన్సులు సినిమాకు ప్లస్‌గా మారాయి. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, విరాట్ యాక్షన్, శ్రీలల లుక్స్ యూత్‌ను ఇట్టే కట్టిపడేశాయి. ఇక ఈ సినిమాలో శ్రీలీల ఆద్యంతం తన అందచెందాలు, నటనతో ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలోనూ అందరినీ మెప్పిస్తోంది. ఆహాలో ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమాకు పూర్ణాచారి పాటలు, హరికృష్ణ సంగీతం, అర్జున్ శెట్టి కెమెరా పనితనం కలిసి వచ్చాయి.
విరాట్, శ్రీ లీలా జంటగా నటించిన ఈ చిత్రానికి
సంగీతం: వి. హరికృష్ణ,
పాటలు: పూర్ణాచారి,
కెమెరా: అర్జున్ శెట్టి
ఎడిటర్: దీపు ఎస్ కుమార్
ఆర్ట్ : రవి ఎస్
ఫైట్స్: డా. కె రవి వర్మ
కాస్ట్యూమ్ డిజైనర్ : సానియా సర్దారియా
నిర్మాతలు : సాయి కిరణ్ బత్తుల, సుదర్శన్ గౌడ్ బత్తుల
రచన – దర్శకత్వం : ఎపి అర్జున్