Ravi Teja: అంత తక్కువలో కానిచ్చేశాడా?.. రవితేజ ‘నీకోసం’ బడ్జెట్‌పై శ్రీనువైట్ల

Ravi Teja: అంత తక్కువలో కానిచ్చేశాడా?.. రవితేజ ‘నీకోసం’ బడ్జెట్‌పై శ్రీనువైట్ల

    Ravi Teja  శ్రీనువైట్ల కెరీర్ మొదలైంది నీకోసం సినిమాతో అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అంతకు ముందు రాజశేఖర్ హీరోగా అపరిచితుడు అనే ఓ చిత్రాన్ని ప్రారంభించాడట. కానీ అది మధ్యలోనే ఆగిపోయిందట. ఎలాగోల ఆ సినిమాను పూర్తి చేయాలని శ్రీను వైట్ల కూడా ఆర్థికంగా సాయం చేసేందుకు ప్రయత్నించాడట. కానీ కుదుర్లేదుట. ఆ తరువాత మళ్లీ ఈ సినిమాను రీ ఓపెన్ చేశారట. కానీ మళ్లీ ఆగిపోయింది.

    అలా చాలా డిసప్పాయింట్‌లో శ్రీను వైట్ల ఉన్నారట. కానీ తీసిన కొద్దిపాటి సినిమాతో ఈడెవడో కొత్తోడు బాగానే తీస్తున్నాడట అనే పేరు వచ్చింది. ఇండస్ట్రీలో అలా నా పేరు బయటకు వచ్చింది. అయితే అప్పుడు చాలా తక్కువ బడ్జెట్‌లో ఓ సినిమాను పూర్తి చేయాలని అనుకున్నాను. అలాంటి సమయంలోనే నీ కోసం సినిమాను తీశాను అని శ్రీను వైట్ల తెలిపాడు.

    38 లక్షల బడ్జెట్‌తో కేవలం 28 రోజుల్లోనే ఆ సినిమాను తీశాను అని శ్రీను వైట్ల అన్నాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆరేడు నందులు కూడా వచ్చాయని అన్నాడు. తాను ఇంత వరకు తీసిని ఏ సినిమాకు కూడా నిర్మాత నష్టపోయింది లేదు. నష్టపోతే నేను నష్టపోయి ఉంటాను కానీ ఏ ఒక్క నిర్మాత కూడా నష్టపోయి ఉండదు. ఎందుకంటే నేను నిర్మాతల బాగు కోరి సినిమాలను తీస్తాను అని శ్రీను వైట్ల అన్నాడు.

    Leave a Reply