• November 3, 2021

Mahesh Babu: అలాంటి సీన్లు కావాలని పట్టుబట్టాడు.. మహేష్ బాబుపై శ్రీనువైట్ల కామెంట్స్

Mahesh Babu: అలాంటి సీన్లు కావాలని పట్టుబట్టాడు.. మహేష్ బాబుపై శ్రీనువైట్ల కామెంట్స్

    Mahesh Babu శ్రీను వైట్ల ఇప్పుడు ఎంతటి దారుణమైన పరిస్థితిలో ఉన్నాడో ప్రత్యేకంగా చెపాల్సిన పని లేదు. ఆగడు వంటి డిజాస్టర్ తరువాత శ్రీనువైట్ల కోలుకోలేకపోయాడు. వివాదాలెన్నో చుట్టు ముట్టాయి. కోన వెంకట్ గోపీ మోహన్ శ్రీను వైట్ల బంధం తెగిపోయింది. శ్రీను వైట్ల ఒంటరిగా తీస్తోన్న సినిమాలు బెడిసి కొడుతున్నాయి. ఇక ఇప్పుడు ఆయన్ను నమ్మి సినిమా చాన్స్ ఇచ్చే వారే కరువయ్యారు.

    అలాంటి శ్రీను వైట్లకు మంచు విష్ణు చాన్స్ ఇచ్చాడు. ఢీ వంటి హిట్ తరువాత మళ్లీ ఇన్నాళ్లకు కలిసి పని చేస్తుంది. డబుల్ డోజ్ అంటూ రాబోతోన్నారు. అయితే ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియదు. కానీ శ్రీను వైట్ల మాత్రం ఇప్పుడు తనది తాను నిరూపించుకోవాల్సిందే. ఎందుకంటే దూకుడు వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన శ్రీను వైట్ల.. మహేష్ బాబుకు ఆగడు రూపంలో ఇండస్ట్రీ డిజాస్టర్ ఇచ్చాడు.

    అయితే దూకుడు సమయంలో జరిగిన కొన్ని విషయాలను తాజాగా శ్రీను వైట్ల పంచుకున్నాడు. తన ప్రతీ సినిమాలో తాగుబోతుల సీన్, సిట్టింగ్ వేసే సీన్ ఉంటుంది. దూకుడు చిత్రంలోనూ కావాల్సిందే అని మహేష్ బాబు పట్టుబట్టాడు. ఎమ్మెల్యే, పోలీస్ ఆఫీసర్, నిజాయితీతో ఉండే కారెక్టర్‌కు పెట్టలేను బాబు అన్నా కూడా వినిపించుకోలేదు. ఎలాగోలా పెట్టాల్సిందేనని మహేష్ బాబు అన్నాడట.

    దీంతో అలా మందు కొట్టించకుండా కేవలం వాసనకే ఎక్కేస్తుందని డైలాగ్‌లతో కానిచ్చినట్టు కనిపిస్తోంది. ఇలా శ్రీను వైట్ల ఇంకా ఎన్నో విషయాలను ఆలీతో సరదాగా షోలో చెప్పాడు. వచ్చే వారం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ప్రస్తుతం ప్రోమోలో అయితే ఎన్నో విషయాల మీద స్పందించినట్టు కనిపిస్తోంది. ఫుల్ మాస్ సినిమా కావాలంటూ.. మహేష్ బాబు అభిమానుల నుంచి ఎక్కువ ఒత్తిడి వచ్చిందని ఆగడు సినిమా గురించి చెప్పుకొచ్చాడు.

    Leave a Reply