- November 9, 2021
చిరంజీవికి అది చెప్పలేకపోయా!.. అందుకే అందరివాడు అంటూ గుట్టు విప్పిన శ్రీను వైట్ల

మెగాస్టార్ చిరంజీవి శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన అందరివాడు ఆశించినంతగా ఆడలేదు. ఫ్లాప్ అయింది. అయితే చిరు చేసిన యాక్షన్, పండించిన ఎమోషన్ మాత్రం ఇప్పటికీ అందరినీ కదిలిస్తుంది. ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందన్నది కరెక్ట్ చెప్పలేం కానీ ఎమోషనల్ సీన్స్ అందరినీ కదిలిస్తాయి. ఫాదర్ సన్ రిలేషన్, ఆ ట్రాక్ అందరికీ కనెక్ట్ అయింది. అయితే సినిమా మాత్రం దారుణంగా బెడిసి కొట్టింది. చిరు అప్పియరెన్స్, అదుపుతప్పిన కథనం, మితిమీరిన కామెడీ ట్రాక్ ఇలా ఎన్నెన్నో కూడా సినిమాకు అడ్డంకిగా మారాయి.
అయితే అందరి వాడు సినిమా గురించి తాజాగా శ్రీను వైట్ల మాట్లాడాడు. అలీతో సరదాగా షోలో గెస్టుగా వచ్చిన శ్రీను వైట్ల తాజాగా ఆ సినిమా సంగతులు వివరించాడు. నాకు నచ్చిన కథలు తీస్తే బాగుంటుంది.. నేను రాసుకున్న కథలే నాకు సూట్ అవుతాయి.. లేదంటే నేను దగ్గరుండి రాయించుకున్న కథలే నాకు సూట్ అవుతాయి. కానీ అందరివాడు కథ నాది కాదు. అది భూపతి రాజా కథ. రెడీమెడ్ కథలకు నేను సూట్ కాను. అంతా రెడీగా ఉంది. వచ్చి డైరెక్షన్ చేయమంటే నేను చేయలేను. అది నా వల్ల కాదు.
కానీ ఈ విషయాలను చిరంజీవి గారికి చెప్పేంత ధైర్యం లేదు.. ఆయన మెగాస్టార్. ఆయనకు ఎలా చెప్పాలా? అని భయపడ్డాను. ఆయనతో సినిమా చేస్తున్నాను అనే గొప్ప ఫీలింగ్‌లో ఉన్నాను. ఆ అవకాశాన్ని చక్కగా వాడుకుంటే బాగుండు. సినిమా హిట్ అయితే బాగుండేది. కానీ ఆ సినిమా బాగానే ఉంటుంది కానీ అనుకున్నంతగా ఆడలేదంతే అంటూ అందరివాడు సినిమా వెనకలా ఉన్న ఫ్లాష్ బ్యాక్‌ను శ్రీను వైట్ల చెప్పేశాడు.