• November 9, 2021

‘కింగ్‌’లో జయసూర్య పాత్ర.. చక్రి గురించి శ్రీనువైట్ల ఓపెన్

‘కింగ్‌’లో జయసూర్య పాత్ర.. చక్రి గురించి శ్రీనువైట్ల ఓపెన్

    శ్రీనువైట్ల సినిమాలకు ఉండే మార్క్ అందరికీ తెలిసిందే. కామెడీ చిత్రాలను తెరకెక్కించడంతో ఈ తరం ప్రేక్షకుల్లో తన ముద్ర వేసుకున్నాడు. దాదాపు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోయాడు. వెంకీ, ఢీ, రెడీ ఇలా బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టేశాడు. అయితే కింగ్ సినిమాను శ్రీనువైట్ల తెరకెక్కించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. కింగ్ సినిమాలో అన్నీ ఒకెత్తు అయితే.. జయసూర్య పాత్ర ఒకెత్తు. బ్రహ్మానందం పోషించిన ఆ పాత్ర ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

    తాజాగా శ్రీను వైట్ల ఆ కారెక్టర్ గురించి అసలు విషయం చెప్పాడు. మామూలుగా అయితే ఆ జయసూర్య పాత్ర.. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గురించి తీశాడని అందరూ అప్పుడు అన్నారు. చక్రి అలా చేస్తుంటాడని, అందుకే ఆ పాత్రకు సింబాలిక్‌గా జయసూర్యను పెట్టి ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు శ్రీను వైట్ల అసలు విషయం బయటకు చెప్పాడు. తాజాగా అలీతో సరదాగా షోకు వచ్చిన శ్రీను వైట్ల ఆ కాంట్రవర్సీ గురించి చెప్పేశాడు.

    జయసూర్య పాత్రను అందరూ చక్రి అనుకున్నారు. కానీ అది కాదు. చక్రి గారు చాలా మంచి వారు. డబ్బులు తీసుకోకుండా కూడా మ్యూజిక్ చేసేవారు. చిన్న సినిమాలకు ఎంతో సాయం చేసేవారు. నా ఢీ సినిమాకు కూడా ఆయనే మ్యూజిక్ ఇచ్చారు. జయసూర్య పాత్ర ఆయనుంచి వచ్చింది కాదు. నేను ఒకరిని చూసి ఆ పాత్రను పెట్టాను. కానీ జనాలు మాత్రం వేరే వాళ్లని అనుకున్నారు.

    నేను మొదటి సారి రామజోగయ్య శాస్త్రిని ఓ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. ఇంకా ఆయన పాటలు రాయడం ప్రారంభించలేదు. బాగా రాస్తాడు అని ఆ మ్యూజిక్ డైరెక్టర్‌కు చెప్పాను. ఒరేయ్ శాస్త్రి ఇటు రా రా అని అన్నాడు. పరిచయం కూడా లేదు అలా అన్నాడేంటి అనుకున్నాను. ఆ ఒక్క పదం నాకు బాగా నచ్చింది. ఒరేయ్ శాస్త్రి అనే పదాన్ని మాత్రం తీసుకున్నాను. అంతే కానీ ఆ పాత్రను ఎవ్వరినీ ఉద్దేశించి తీసింది కాదు అని శ్రీను వైట్ల కార్లిటీ ఇచ్చారు.

    Leave a Reply