• August 1, 2025

బేబికి రెండు జాతీయ అవార్డులు.. గాల్లో తేలిపోతోన్న ఎస్‌‌కేఎన్

బేబికి రెండు జాతీయ అవార్డులు.. గాల్లో తేలిపోతోన్న ఎస్‌‌కేఎన్

    భారత ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో బేబీ దుమ్ములేపేసింది. తెలుగు సినిమాలు ఈ సారి జాతీయస్థాయిలో సత్తా చాటాయి. బేబీ చిత్రానికి ఏకంగా రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. వంద కోట్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన బేబీ చిత్రం ఇప్పుడు జాతీయ అవార్డుల్లోనూ అద్బుతాలు సృష్టించింది.

    బేబీ సినిమాలోని ప్రేమిస్తున్నా పాటను పాడిన రోహిత్‌కు ఉత్తమ సింగర్‌గా అవార్డు వచ్చింది. ఇక బేబీ స్క్రీన్ ప్లేకి కూడా సాయి రాజేష్‌కి అవార్డు వచ్చింది. అలా బెస్ట్ సింగర్, బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీల్లో బేబీ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. దీంతో నిర్మాత ఎస్ కే ఎన్ గాల్లో తేలిపోతోన్నారు. మా బేబీ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయంటూ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.