• November 19, 2021

ఇల్లీగల్ పనులు చేయను!.. చెత్త ప్రశ్నకు శ్రుతీ హాసన్ సమాధానం

ఇల్లీగల్ పనులు చేయను!.. చెత్త ప్రశ్నకు శ్రుతీ హాసన్ సమాధానం

    శ్రుతీ హాసన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన ప్రియుడు శంతనుతో కలిసి శ్రుతీ హాసన్ చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఈ ఇద్దరూ పబ్లిక్‌గానే రెచ్చిపోతుంటారు. అది సూపర్ మార్కెట్ అయినా సరే ఎయిర్ పోర్ట్ అయినా సరే ఈ ఇద్దరి రొమాన్స్ మాత్రం మారదు. చుట్టు పక్కల ఎవరున్నారనేది వాళ్లు చూడరు. వాళ్ల ధోరణి వాళ్లదే. అయితే శ్రుతీ హాసన్ ఇప్పుడు మళ్లీ బిజీగా మారుతోంది. తాజాగా శ్రుతీహాసన్‌కు బాలయ్య సినిమాలో ఆఫర్ వచ్చింది.

    ప్రభాస్ సలార్ సినిమాలోనూ శ్రుతీ హాసన్‌కు ఇంపార్టెన్స్ ఏమీ ఉండదని తెలుస్తోంది. అప్పుడు మిగతా హీరోయిన్ల డేట్లు దొరక్కపోవడంతో అలా శ్రుతీ హాసన్‌ను తీసుకున్నారనే టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాలో శ్రుతీ హాసన్ మొదట నో చెప్పిందట. కానీ దర్శకుడితో ఉన్న ర్యాపో వల్ల సినిమాను అంగీకరించినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ వారంలోనే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.

    బాలయ్య పక్కన శ్రుతీ హాసన్ నటించబోతోంది. అయితే శ్రుతీ హాసన్ తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. అందులో ఒక్కొక్కరు విచిత్రమైన ప్రశ్నలు అడిగారు. దాంట్లో ఓ నెటిజన్ మాత్రం మరీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లాడు. టీనేజ్ అబ్బాయితో నువ్ డేటింగ్‌కు వెళ్తావా? అని అడిగేశాడు.

    దానికి శ్రుతీ హాసన్ దిమ్మదిరిగేలా సమాధానం ఇచ్చింది. టీనేజ్ అబ్బాయితో డేట్ చేయడమనేది ఇల్లీగల్. అలాంటి పనులు నేను చేయను.. పైగా ఈ ప్రశ్నే చాలా చెత్తగా ఉంది బై అంటూ సదరు నెటిజన్‌కు శ్రుతీ హాసన్ గడ్డి పెట్టేసింది. మొతానికి శ్రుతీ హాసన్‌కు మాత్రం చాలా వింత అనుభవమే ఎదురైంది.

    Leave a Reply