- November 15, 2021
వరుసగా దెబ్బ మీద దెబ్బ!.. డిప్రెషన్లోకి వెళ్లిన శివానీ రాజశేఖర్
రాజశేఖర్ కూతుర్లిద్దరూ కూడా హీరోయిన్లు వెండితెరపై వెలిగేందుకు వచ్చారు. అందులో చిన్న కూతురు అయితే అరంగేట్రం జరిగింది. దొరసాని అంటూ అందరినీ మెప్పించింది. అలా వరుసగా సినిమాలను పట్టాలెక్కింది. కానీ పెద్ద కూతురు శివానికి అడుగడునా గండాలే ఎదురువుతున్నాయి. మొదలు పెట్టిన సినిమా మధ్యలోనే ఆగిపోతోన్నాయి. అలా ఒకటి కాదు రెండు మూడు సినిమాలు వెంటవెంటనే ఆగిపోయాయి. అయితే వాటి గురించి శివానీ నోరు విప్పింది.
శివానీ నటించిన అద్భుతం అనే సినిమా ఒకటి ఓటీటీలో రాబోతోంది. నవంబర్ 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రాబోతోంది. ఈ క్రమంలో శివానీ మీడియా ముందుకు వచ్చింది. ఎన్నో విషయాలను పంచుకుంది. హిందీ సినిమా ‘2 స్టేట్స్’ రీమేక్‌తో తెలుగులో నా ఎంట్రీ ఉండాల్సింది. కానీ ఆ సినిమా ఆగిపోయిందని చెప్పింది. ఆ తర్వాత తమిళంలో నా తొలి సినిమా విష్ణువిశాల్‌తో ఓకే అయ్యింది.. ఆ సినిమా కూడా వాయిదా పడిందని చెబుతూ బాధపడింది.
2020 జనవరిలోనే ‘అద్భుతం’ షూటింగ్ పూర్తయిందట. కానీ కరోనా వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఓ దశలో నేను చేసిన సినిమాలు ఎందుకు రిలీజ్ కావడం లేదనే డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్‌ను ఫీలయ్యానంటూ మనసులో బాధను బయటపెట్టేసింది. ఎవ్వరికైనా సరే అలా దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే ఒత్తిడికి గురవుతారు.. అప్పుడు నాన్న(రాజశేఖర్), అమ్మ(జీవిత) సపోర్ట్ ఇచ్చారని తెలిపింది. ఇక ఇటీవల తన తాత వరద రాజన్‌గారు చనిపోయారని, నా చెల్లి మూవీస్ చూసిన ఆయన నావి చూడలేదని బాధగా ఉందని శివానీ ఎమోషనల్ అయింది.