- January 12, 2022
మగాడంటే మీలా ఉండాలి!.. నాగ్‌పై మనసు పారేసుకున్న సీరియల్ నటి

సంక్రాంతి పండుగ సందర్భంగా బుల్లితెర ఛానల్ జీ తెలుగు ప్రేక్షకులను సందడి చేయడానికి ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే బంగార్రాజుతో సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బంగార్రాజు టీమ్ పాల్గొన్నారు. ఇందులో నాగార్జున, నాగచైతన్య, కృతి శెట్టి పాల్గొని ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందించారని తాజాగా విడుదల చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి ఉదయభాను యాంకర్ గా వ్యవహరించారు. అలాగే సుమ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేశారు. ఈ విధంగా బంగార్రాజు టీమ్ తో పాటు పలువురు బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్ లు ఈ వేదికపై తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కొందరు సీరియల్ ఆర్టిస్టులు నాగార్జున గురించి మాట్లాడుతూ ఇప్పటికీ మన్మధుడే అంటూ కింగ్ నాగార్జున పై ప్రశంసలు కురిపించారు..
ఈ వేదిక పైకి వచ్చిన సీరియల్ ఆర్టిస్ట్ నక్షత్ర శ్రీనివాస్ వేదిక పైకి రాగా ఉదయభాను నాగార్జున కళ్ళల్లోకి చూడమని చెప్పారు. నేను చూడలేకపోతున్నా అంటూ నక్షత్ర తెలుపగా నాగార్జున మాత్రం వచ్చినప్పటి నుంచి నేను నిన్నే చూస్తున్నాను అంటూ చెప్పడంతో సదరు నటి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు.
అదేవిధంగా మరొక సీరియల్ ఆర్టిస్ట్ వేదికపైకి వచ్చి నాగార్జున గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అబ్బాయిలన్నా.. మగాళ్లన్నా.. మీలా ఉండాలి అంటూ నాగార్జున పై కామెంట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.