- August 8, 2025
సంతోష్ శోభన్ మూవీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీజర్

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా “కపుల్ ఫ్రెండ్లీ”. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ గా “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా తెరకెక్కుతోంది. త్వరలో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎలా ఉందో చూస్తే – ‘నెల్లూరుకు చెందిన యువకుడు శివ(సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనింగ్ చేసి సరైన ఉద్యోగం లేక చెన్నై నగరంలో ఇబ్బందులు పడుతుంటాడు. ఖర్చుల కోసం బైక్ పూలింగ్ చేస్తుంటాడు. ప్రీతి (మానస వారణాసి) శివ బైక్ పై జర్నీ చేస్తుంది. అపరిచితులుగా కలిసిన శివ, ప్రీతి ప్రేమికులుగా మారడం, సన్నిహితంగా ఉన్న వారి ప్రేమ సన్నివేశాలను చూపిస్తూ టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఈ టీజర్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రవీంద్రన్ కంపోజ్ చేసిన ‘ స్పార్క్స్ ఇన్ యువర్ ఐస్, దే షైన్..’ అంటూ సాగే బిట్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ‘ ఒకప్పటి సాధారణ క్షణాలన్నీ జ్ఞాపకాలుగా మారడమే జీవితం..’ అంటూ టీజర్ చివరలో వేసిన క్యాప్షన్ “కపుల్ ఫ్రెండ్లీ” బ్యాక్ డ్రాప్ ను రిఫ్లెక్ట్ చేస్తోంది.