• November 14, 2021

క్రేజీ న్యూస్.. ‘పుష్ప’లో సమంత!

క్రేజీ న్యూస్.. ‘పుష్ప’లో సమంత!

    సమంత ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్ట్‌లు ఉండాలని కోరుకుంటోంది. అలాంటి సమంతకు ఇప్పుడు ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. పుష్ప సినిమాలో ఐటం సాంగ్‌కు సమంత స్టెప్పులు వేయనుందని టాక్ వినిపిస్తుంది. అసలే సుకుమార్. ఐటం సాంగ్‌లకు స్పెషలిస్ట్. ఇక సమంతను తీసుకున్నారనే విషయం బయటకు వస్తుండటంతో ఆ పాట మీద అంచనాలు పెరిగాయి. అయితే నిజంగానే సమంత ఆ ఐటం సాంగ్‌లో కనిపిస్తుందా? అన్నది చూడాలి. ఇవన్నీ గాలి వార్తలా? లేదంటే ఇందులో నిజం ఏమైనా ఉందా? అనేది ఇంకొన్ని రోజుల్లో తేలనుంది.

    అయితే సుకుమార్ బన్నీ దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటేనే మాస్ ప్రేక్షకులకు ఓ ట్రీట్. అన్న రకాల పాటలను పెట్టేస్తుంటారు. లవ్, ఫీల్, ఎమోషనల్, మాస్ సాంగ్‌లను స్పెషల్‌గా పెడతాడు దేేవీ. ఇక ఈ పాన్ ఇండియన్ మూవీకి ఇంకెంత శ్రద్ద పెట్టి ఉంటాడో. అందుకే ఈ ఐటం సాంగ్‌పై మరింత ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.

    సమంతకు ఇప్పుడు ఉత్తరాదిన కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఫ్యామిలీ మెన్ సీజన్ 2తో సమంత అక్కడ కూడా ఫుల్ పాపులర్ అయింది. అందుకే సుకుమార్ దృష్టిలో సమంత బెస్ట్ ఆప్షన్ అని అనిపించి ఉండొచ్చు. ఏదైనా గానీ ఈ వార్త కనుక నిజమైతే.. సమంత ఖాతాలో మరో స్పెషల్ ప్రాజెక్ట్ పడ్డట్టే. ఇప్పటికే రెండు సినిమాలతో సమంత దూసుకుపోతోంది. ఆ రెండూ కూడా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కబోతోన్నాయి.

     

    Leave a Reply