- October 19, 2021
ఆ పనులు ఎప్పుడూ చేయొద్దు.. కచ్చితంగా బాధపడాల్సి వస్తుంది : సమంత

సమంత ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఆమె ఏం చేసినా కూడా జనాలు ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. అసలే విడాకుల తరువాత సమంత మీద కాస్త నెగెటివిటీ ఎక్కువగా వస్తోంది. సమంత మీద ఇన్ని రకాల రూమర్లు వచ్చినా కూడా ఎప్పుడూ ఏ ఒక్క సెలెబ్రిటీ వచ్చి ఖండించలేదు. ఇక శాకుంతలం సినిమా నిర్మాత, గుణ శేఖర్ కూతురు నీలిమ గుణ మాత్రం జాతీయ మీడియాతో మాట్లాడింది. సమంత గురించి కొన్ని నిజాలు చెప్పింది. పిల్లల్ని కనేందుకు ప్లానింగ్ కూడా వేసిందని చెప్పుకొచ్చింది.
అలా సమంత గురించి నీలిమ గుణ మాత్రమే స్టాండ్ తీసుకుంది. సమంత ఫ్రెండ్స్ అయిన నందినీ రెడ్డి, చిన్మయి, శిల్పా రెడ్డి వంటి వారు ఎక్కడా కూడా బయటకు వచ్చి వాటిని ఖండించలేదు. కాకపోతే నీలిమ గుణ అలా బయటకు వచ్చి చెప్పడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే తనపై వచ్చిన రూమర్లను సమంత ఖండించింది. ఇలా వ్యక్తిగతంగా దాడి చేయకండని ఫైర్ అయింది. తనకు ఎలాంటి అఫైర్లు లేవని, అబార్షన్లు చేయించుకోలేదని క్లారిటీ ఇచ్చింది.
అయితే సమంత ఇప్పుడు అన్నీ మరిచిపోయి తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టేసింది. ఎప్పటిలానే తన పెట్ హష్‌తో జాలీగా గడిపేస్తోంది. జిమ్‌లో తెగ వర్కవుట్లు చేస్తోంది. ఇక సమంత ఇప్పుడు తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. జిమ్‌లో తాడుతో ఆడుకున్న వీడియోను షేర్ చేసింది. ఇందులో శిల్పా రెడ్డి ఫ్యామిలీ ఉన్నట్టు కనిపిస్తోంది. తాడుకు ఒకవైపు సమంత, శిల్పా రెడ్డి ఉండగా.. మరో వైపు ఓ చిన్నపిల్లవాడు, ఓ పెద్ద వ్యక్తి కనిపిస్తున్నాడు.
అయితే ఇందులో సమంత తాడును లాగలేక కిందపడిపోయింది. ఇక ఈ వీడియోలో సమంత ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోన్నట్టుగా కనిపిస్తోంది. నా బెస్టీలతో ఎంతో ఎంజాయ్ చేశాను.. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. ఇలా బలవంతైమన, ఫిట్‌గా ఉన్న ఫ్యామిలీతో ఇలాంటి ఆటలు ఆడొద్దు. ఆడితే కచ్చితంగా బాధపడతాం.. కచ్చితంగా నొప్పులు పుడతాయి అని సమంత చెప్పుకొచ్చింది. నవ్వలేకుండా ఉండలేను అంటూ హ్యాష్ ట్యాగ్‌లు పెట్టేసింది సమంత.