• January 31, 2024

ఓటీటీలోకి సైంధవ్.. వచ్చేది ఎప్పుడంటే?

ఓటీటీలోకి సైంధవ్.. వచ్చేది ఎప్పుడంటే?

    శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మించిన సైంధవ్‌ చిత్రంలో వెంకటేష్‌ దగ్గుబాటి, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రల్లో నటించారు.

    కదిలించే భావోద్వేగాలు, కట్టిపడేసే యాక్షన్‌తో కూడిన ఈ చిత్రంలో వెంకటేష్‌ దగ్గుబాటి సైంధవ్‌ కోనేరు అలియాస్‌ సైకో పాత్రలో నటించారు. బాధకరమైన గతాన్ని కలిగిన సైకో, వాటిని పక్కన పెట్టి కూతురు గాయత్రితో కలిసి బాధ్యతాయుతమైన తండ్రిగా ఒక సాధారణ జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. అయితే గాయత్రికి ప్రాణాంతకమైన వ్యాధి ఉన్నట్టు తేలడంతో ఆ ప్రశాంతత చెదిరిపోతుంది.

    కఠినమైన పరిస్థితిని ఎదుర్కొన్న సైకో తన కూతురిని ఎలాగైనా కాపాడుకోవాలనే నిశ్చయంతో చీకటి సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. దీంతో పాత విరోధులతో మళ్లీ పోరాటం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ చిత్రంలో పోషించిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ పాత్ర వికాస్‌ మాలిక్‌ ద్వారా నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తెలుగులోకి తెరంగేట్రం చేశారు. కాలానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సైకో మరి ముంచుకొస్తున్న ముప్పు నుంచి తన కుమార్తె రక్షించుకోవడంలో విజయం సాధిస్తాడా? తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమ్ అయ్యే సైంధవ చూడాల్సిందే.