- March 9, 2024
అందుకే పేరు మార్చుకున్నా.. సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్
సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల ప్రేమ, మహిళల పట్ల గౌరవం వున్న కథానాయకుల్లో జాబితాలో ముందు వరుసలో వుంటారు హీరో సాయి దుర్గ తేజ్. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తన సంపాదనలో కొంత ఛారిటీ కూడా చేస్తుంటారు. విజయవాడలోని వృద్ధాశ్రమం తో పాటు తెలంగాణలోని ఓ ఊళ్లో 100 మందికి పైగా ఉన్న స్కూల్ లోని పిల్లల బాధ్యత కూడా తీసుకున్నారు. ఈ సామాజిక కోణంలోనే ఆలోచించి మహిళల పట్ల తనకున్న అమితమైన గౌరవం, సైనికుల పట్ల వున్న ప్రేమతో ఆయన ప్రధాన పాత్రలో నటించిన మ్యూజికల్ షాట్ ఫీచర్ సత్య. కలర్స్ స్వాతి ఆయనకు భార్యగా నటించిన ఈ మ్యూజికల్ షాట్ ఫీచర్‌ను దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంతో కలిసి సాయి దుర్గతేజ్ సొంత సంస్థ విజయ దుర్గ ప్రొడక్షన్స్ సంస్థ ఈ షాట్ ఫీచర్‌ను నిర్మించింది. హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలు. కాగా శుక్రవారం మహిళా దినోత్సం సందర్భంగా ఈ చిత్రం ప్రత్యేక షోను మీడియాకు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్రం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గత సంవత్సరం ఈ సంస్థలో బలగం నిర్మించాం. మళ్లీ సత్య లాంటి ఓ మంచి షాట్ ఫీచర్‌ను నిర్మించాం. ఈ సోసైటీకి తన వంతుగా ఏమైనా చేయాలని నిత్యం తపన పడతాడు సాయిధరమ్ తేజ్. ఆయనతో పాటు ఈ సినిమా టీమ్ అంతా సమాజానికి తమ వంతు ఏమైనా చేయాలని చేసిన సినిమా ఇది. తప్పకుండా మా అందరి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను అన్నారు.
హీరో సాయిదుర్గతేజ్ మాట్లాడుతూ నా జీవితంలో ముగ్గురు గొప్ప మహిళలు వున్నారు. మా అమ్మమ్మ అంజనా దేవి గారు, మా అమ్మ విజయ దుర్గ , మా పిన్ని మాధవి. వీరే నా బిగ్గెస్ట్ హ్యపీనెస్. ఇక ఈ సినిమా నా స్నేహితులు నవీన్, హర్షిత్ చేస్తున్నారని తెలియగానే, ఇంత గొప్ప సినిమాలో నేను భాగమవుతానని అడిగి జాయిన్ అయ్యాను. ఈ సినిమా ద్వారా నవీన్ నాలో కొత్త యాంగిల్‌ను తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు దాదాపు 25 ఫిలిం ఫెస్టివల్స్‌లో ఈ చిత్రం ప్రదర్శింపబడింది. చాలా అవార్డులు కూడా వచ్చాయి అన్నారు.
దర్శకుడు నవీన్ విజయక్రిష్ణ మాట్లాడుతూ సోల్జర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ షాట్ ఫీచర్ ను చెప్పాలనేది హర్షిత్ ఐడియా. ఆ ఐడియా నచ్చి నేను, సాయి జాయిన్ అయ్యాం. ఇండియాలో ఎంతో గొప్ప మహిళలు వున్నారు. అలాంటి వాళ్ల కొంత మంది వాళ్ల గురించి అందరికి తెలియాలి. చాలా మంది వీరనారిల కథ అందరికి తెలియాలి. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. వారు అనుకుంటే సాధించనిది ఏమీ లేదు. ఇప్పటి వరకు మా చిత్రానికి 25 ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి. ఎన్నోఅంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఈసినిమాను ప్రదర్శించాం అన్నారు. హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ శ్రుతిరంజని అందించిన షాట్ సాంగ్‌కు ఈ షాట్ ఫీచర్‌కు ప్రేరణగా నిలిచింది. నవీన్, సాయి నేను మంచి స్నేహితులం, మా కాంబినేషన్‌లో ఓ మంచి పర్పస్‌ఫుల్ ఫీచర్‌ను, సాయిధరమ్ తేజ్ ఓన్ బ్యానర్‌తో కలిసి ఇది నిర్మించినందుకు ఆనందంగా వుంది అన్నారు. ఈ సమావేశంలో బాలనటి సాయి తేజస్విని కూడా పాల్గొన్నారు.
మా అమ్మ ఎప్పటికీ నాతోనే వుండాలి: సాయి దుర్గతేజ్
సినిమా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి నాకు మా అమ్మపేరు మీద ఓ నిర్మాణ సంస్థన ప్రారంభించాలని వుండేది. అందుకే అమ్మ పేరు మీద విజయదుర్గ ప్రొడక్షన్స్ ను ప్రారంభించి, దిల్ రాజు ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ సినిమా నిర్మించాను. అమా అమ్మ ఎప్పుడూ నాతోనే వుండాలి. అందుకే ఇక నుంచి నా పేరును సాయి దుర్గతేజ్‌గా మార్చుకుంటున్నాను అని తెలిపారు.
సత్య సినిమా గురించి:
దేశం కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలను అర్పిస్తున్న సైనికులకు, వారి వెనుకున్న ఎందరో తల్లులు, భార్యలు, అక్కలు, చెల్లెళ్లకు నివాళి గా.. మంచి కాన్సెప్ట్ తో ఈ షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు. ఇందులో సోల్జర్ గా సాయిధరమ్ తేజ్ కనిపిస్తారు. ఆయన భార్యగా కలర్స్ స్వాతి నటించింది. భార్య భర్తల మధ్య ఉండే ప్రేమానుబంధాన్ని ఈ వీడియోలో చక్కగా చూపించారు. ఓవైపు భార్యను ప్రేమిస్తూనే మరోవైపు దేశాన్ని కూడా ప్రేమిస్తూ దేశం కోసం ప్రాణాలర్పించే సోల్జర్ పాత్రలో సాయిధరమ్ తేజ్ నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. దేశాన్ని ప్రేమిస్తూ దేశం కోసం పోరాడే గొప్ప యోధులను కని, పెంచడమే కాకుండా.. దేశం కోసం తమ ప్రేమను త్యాగం చేసిన గొప్ప మహిళలందరికీ ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ సాంగ్ ను అంకితం ఇచ్చారు. సింగర్ శృతి రంజని ఈ పాటను కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా లిరిక్స్ రాసి పాట పాడారు.