- October 26, 2021
నాకిదే మొదటి సారి.. ఆ అనుభవంపై రీతూ వర్మ కామెంట్స్

రీతూ వర్మ అంటే అందరికీ పెళ్లి చూపులు సినిమానే గుర్తుకు వస్తుంటుంది. అయితే ఆ తరువాత తెలుగు మళ్లీ అంతటి హిట్ సినిమా రాలేదు. కానీ కోలీవుడ్, మాలీవుడ్ అంటూ చాలానే తిరిగింది. వేరే భాషల్లో సినిమాలు చేసింది. కానీ తెలుగు స్ట్రెయిట్ సినిమా చేయలేదు. ఇక ఈ వారం వరుడు కావలెను అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా తన మనసులోని మాటలను బయటపెట్టేసింది రీతూ వర్మ. తనకు ఇంత వరకు డ్యాన్స్ చేసే స్కోప్ రాలేదని చెప్పింది.
అంతలా డ్యాన్స్ చేయడం, ఓ మాస్ సాంగ్‌కు స్టెప్పులు వేయడం ఇదే మొదటిసారి అని రీతూ వర్మ చెప్పుకొచ్చింది. డాన్స్ లో నేను పూర్ అని రీతూ వర్మ తనది తానే చెప్పేసుకుంది. కానీ డాన్స్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఇప్పటి వరకు నాకు డాన్స్ చేసే సాంగ్స్ పడలేదు అని తన కెరీర్ గురించి చెప్పింది. కానీ ఫస్ట్ టైం ఇందులో ఒక మాస్ సాంగ్ చేశాను అంటూ ఆ అనుభం గురించి చెప్పేసింది. చాలా కష్టపడి డాన్స్ చేశాను.. ఆ సాంగ్ ని థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని, ఆ సాంగ్ పర్ఫెక్ట్ సిచ్యువేషన్ లో వస్తుందని పేర్కొంది.
‘కోల కళ్ళే ఇలా’ నా ఫేవరేట్ సాంగ్.. బేసిక్‌గా సిద్ శ్రీరామ్ ఏం పాడినా నాకు నచ్చుతుందని తన ఇష్టాన్ని బయటపెట్టేసింది రీతూ వర్మ. అలా సిధ్ శ్రీరామ్ వాయిస్ కూడా సాంగ్‌కి ప్లస్ అయ్యిందని చెప్పుకొచ్చింది. అలాగే ఆల్బంలో మనసులోనే నిలిచిపోకే అనే సాంగ్ కూడా బాగా ఇష్టమని చెప్పింది. సినిమాలో లవ్ స్టోరీ అందరికీ నచ్చేలా ఉంటుందని చెప్పుకొచ్చింది. రెగ్యులర్‌గా అనిపించదని ఓల్డ్ స్కూల్ రొమాన్స్‌లా ఉంటుందని చెప్పుకొచ్చింది.