• November 4, 2021

ENEMY ట్విట్టర్ రివ్యూ.. విశాల్ మాస్ ఎంట్రీ

ENEMY ట్విట్టర్ రివ్యూ.. విశాల్ మాస్ ఎంట్రీ

    తెలుగులో విశాల్, ఆర్యలకు మంచి మార్కెట్ ఉంది. తమిళంలో ఎలా ఆడతాయో.. ఎలాంటి క్రేజ్ ఉందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. అందుకే వారు ఒకే సారి తమ సినిమాలను అక్కడా ఇక్కడా విడుదల చేస్తుంటారు. ఇక నేడు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఎనిమీ చిత్రం నేడు విడుదలైంది. ఈ క్రమంలో నెట్టింట్లో ఎనిమీపై నెటిజన్ల టాక్ అదిరిపోయింది. ఈ మేరకు సినిమా గురించి అందరూ పాజిటివ్‌గా మాట్లాడుకుంటున్నారు.

    విశాల్ మాస్ ఎంట్రీ అంటూ నెటిజన్లు విజిల్స్ వేస్తున్నారు. ఇక శామ్ సీఎస్ సంగీతం అదిరిపోయిందని అంటున్నారు. పాటలు, ఫైట్లు అదరగొట్టేశారని అంటున్నారు. ఎనిమీ ఫస్ట్ హాఫ్ అయితే దుమ్ములేపిందని అంటున్నారు. ఇక ఆనంద్ శంకర్ మాత్రం తన దర్శకత్వ ప్రతిభను మాత్రం చూపించేశాడని కామెంట్లు పెడుతున్నారు. ఆర్య అద్భుతంగా నటించేశాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    అయితే తమిళ నాటలో ఈ రెండు చిత్రాలు ఒకే సారి విడుదల కావడంతో థియేటర్ల సమస్య వచ్చినట్టుంది. దాదాపు అన్ని చోట్లా అన్నాత్తె విడుదలైంది. ఇక ఎనిమికి తక్కువ థియేటర్లు ఇచ్చినట్టు కనిపిస్తోంది. రెండు స్క్రీన్లు ఉన్న థియేటర్లో కూడా అన్నాత్తెను నడిపిస్తున్నారట. ఎనిమికి ఎక్కువ థియేటర్లు ఇవ్వలేదు. షోలు వేయలేదు అంటూ విశాల్, ఆర్యల అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరి ఎనిమి సినిమా అందరినీ ఆకట్టుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.

    Leave a Reply