- November 7, 2024
జాతర రివ్యూ.. ఆ సీన్లకు గూస్ బంప్స్
సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించారు. ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్‌గా, ఇంటెన్స్ డ్రామాతో ‘జాతర’ తెరకెక్కింది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే జాతర నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 8న థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
ఆలయ పూజారి పాలేటితో కథ మొదలవుతుంది. అతని కొడుకు చలపతి (సతీష్ బాబు రాటకొండ) ఓ నాస్తికుడు. అదే ఊరికి చెందిన వెంకట లక్ష్మి (దీయ రాజ్) చతపతితో ప్రేమలో ఉంటుంది.అంతా సవ్యంగా సాగుతున్న టైంలో గంగిరెడ్డి (ఆర్కే నాయుడు) వస్తాడు. ఒకరోజు గంగావతి గ్రామదేవతలు కలలో వచ్చి పాలేటికి ఇక్కడే ఉండి గ్రామాన్ని దురాచారాల నుండి రక్షించమని కోరుతుంది. పాలేటి గ్రామం నుండి అదృశ్యమవుతుంది. గ్రామ దేవత అకస్మాత్తుగా గ్రామాన్ని విడిచిపెట్టినప్పుడు ఒక చెడు సంకేతం అని ప్రజలు నమ్ముతారు. గంగి రెడ్డి (RK నాయుడు) గ్రామ కార్యకలాపాలను చేపట్టడం, గ్రామ దేవతలను శాశ్వతంగా ఉండడానికి తన ఇంటికి ఆహ్వానించడం వంటివి చేస్తాడు. RK నాయుడు, పాలేటి కుటుంబం మధ్య ఉన్న లింక్ ఏంటి? చలపతికి తన తండ్రి అదృశ్యమైన నిజం తెలుస్తుందా? అసలు అతనికి ఏమైంది? ఆర్కే నాయుడు, చలపతి మధ్య చివరకు ఏం జరిగింది? అనేది కథ.
నటీనటులు
సతీష్ బాబు రాటకొండ ఈ చిత్రంలో నటుడిగా, రచయితగా మరియు దర్శకుడిగా తన మల్టీ టాలెంటెను చూపించాడు. నటనతో సినిమాను పూర్తిగా డామినేట్ చేసాడు, తన టేకింగ్‌తో సినిమాలో తన బెస్ట్ ఇచ్చాడు. దీయా రాజ్ తన పాత్రలో చాలా బాగుంది. RK నాయుడు గంగిరెడ్డి పాత్రలో అద్భుతంగా నటించాడు. బత్తుల లక్ష్మి, రాము గల్లా, గల్లా మంజునాథ్, మహబూబ్ పాషా షేక్ పాత్రలు బాగున్నాయి.
విశ్లేషణ
పల్లెటూరి సంస్కృతి, ఊర్లో జాతరను తలపించేలా చిత్రం ఉంటుంది. నోస్టాల్జిక్ క్షణాలను ఇచ్చేలా సినిమా ఉంటుంది. ఈ చిత్రం పూర్తి అన్ని అంశాలను మిక్స్ చేసి తీయడంతో ఖచ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. అందరినీ కట్టిపడేసేలా, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను మిస్ కాకుండా ఈ చిత్రాన్ని అందించడంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కథను చెప్పడంలో అతని మేకింగ్, రైటింగ్ పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది.
రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ ప్రొడక్షన్ వాల్యూస్ లావిష్‌గా ఉన్నాయి. శ్రీజిత్ ఎడవనా సంగీతం ముఖ్యంగా మాస్ నంబర్‌లకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆర్ఆర్ అదిరిపోయింది. సినిమాటోగ్రాఫర్ కె.వి.ప్రసాద్ ఆకట్టుకున్నారు. పల్లెటూరి అందాలను, దేవత సన్నివేశాలను ప్రదర్శించడంలో అతని టాలెంట్ కనిపిస్తుంది. బి.మహేంద్రనాథ్ ఎడిటింగ్ చక్కగా, క్రిస్పీగా ఉంది.
సినిమా స్లో నోట్‌లో ప్రారంభమైనప్పటికీ, నెమ్మదిగా ప్రేక్షకులు తక్కువ సమయంలో ప్లాట్‌కి కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా దేవత సన్నివేశాలు, BGM సినిమా మొత్తం ఆడియెన్స్‌ను వెంటాడతాయి. సినిమాలో చాలా సర్ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు ఉంటాయి. సినిమా ప్రారంభంలో, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు అదిరిపోయాయి.
రేటింగ్ 3