• November 4, 2021

Peddhanna ట్విట్టర్ రివ్యూ.. రొటీన్ పెద్దన్న

Peddhanna ట్విట్టర్ రివ్యూ.. రొటీన్ పెద్దన్న

    సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన పెద్దన్న సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదలైంది. అయితే ఇప్పుడు మాత్రం ట్విట్టర్‌లో పెద్దన్న సినిమాకు సంబంధంచి ట్విట్టర్‌లో మోతమోగుతోంది. పెద్దన్న, అన్నాత్తె అంటూ తెలుగు, తమిళ ప్రేక్షకులు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం పెద్దన్న, అన్నాత్తెపై ప్రేక్షకులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

    శివ సినిమాలు ఎలా ఉంటాయో తెలిసిందే. రొడ్డ కొట్టుడు చిత్రాలతో శివ నెట్టుకొస్తున్నాడు. తెలుగు ఫార్మూలాను తీసుకొని వెళ్లి తమిళంలో హిట్లు కొట్టేశాడు. వేదాళం, విశ్వాసం అంటూ తెలుగు ఫార్మూలాలను వాడాడు. హిట్లు కొట్టేశాడు. కానీ అవేవీ కూడా తెలుగు ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఫార్మూలాతోనే అన్నాత్తె (పెద్దన్న) అంటూ వచ్చింది. అయితే ఈ చిత్రం కూడా అలానే ఉందని కామెంట్లు పెడుతున్నారు.

    శివ తీసిన గత చిత్రాల మాదిరిగానే ఈ పెద్దన్న కూడా ఉందట. రొటీన్‌గా ఉందంటూ నెటిజన్లు అంటున్నారు. కాకపోతే రజినీ మేనియా, యాక్టింగ్, స్టైల్‌తో నెట్టుకొచ్చేశాడని అంటున్నారు. శివ తీసిన చిత్రాలు ఒకే టైపులో ఉంటాయని, ఇది కూడా అంతేలా ఉందని చెబుతున్నారు. కొన్ని ఎమోషనల్ సీన్లు బాగున్నాయని, చాలా మట్టుకు పాత చిత్రాలనే గుర్తుకు తెస్తాయని అంటున్నారు. మొత్తానికి పెద్దన్న మాత్రం రొటీన్ ఫార్మూలా సినిమానే అంటున్నారు. మరి కలెక్షన్లలో ఈ చిత్రం ఎంత వరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

     

    Leave a Reply