- November 4, 2021
Manchi Rojulochaie ట్విట్టర్ రివ్యూ.. ఇక నువ్ మారవా?

మారుతి సినిమాలు అంటే ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఒకటే కాన్సెప్ట్. అదే రొడ్డ కొట్టుడు కామెడీ. ఇక మంచి రోజులు వచ్చాయి సినిమా కూడా అలానే సాగిందని నెటిజన్లు అంటున్నారు. ఈ మూవీని చూసిన నెటిజన్లకు చిర్రెత్తినట్టుంది. దెబ్బకు మారుతిని ఏకిపాడేస్తున్నారు. మారుతి ఇక నువ్ మారవా? అంటూ నెటిజన్లు ట్విట్టర్లో ఫైర్ అవుతున్నారు. మొత్తానికి కమెడియన్లను మెయిన్ కారెక్టర్లను చేశాడు.. హీరోను సైడ్ కారెక్టర్ చేశాడు పాపం అంటూ సంతోష్ గురించి బాధపడుతున్నారు.
రొటీన్ స్టఫ్.. అజయ్ ఘోష్‌ని హీరోగా పెట్టావ్ ఏంట్రా అని మండి పడుతున్నారు. ఇంటర్ నిబ్బా నిబ్బి మారుతి మార్క్ కామెడీనే ఉంది.. అయితే కొన్ని మాత్రం మంచి సీన్లే పడ్డాయని అంటున్నారు. సుదర్శన్ తెగ నవ్వించేశాడట. ప్రస్తుతం ఉన్న పరిస్థితులో మంచి సందేశాన్ని ఇచ్చారు అని మారుతి ఇంకొందరు పొగిడేస్తున్నారు. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం మంచి రొజులు వచ్చాయ్ చిత్రాన్ని ఏకిపారేస్తున్నారు.
మొత్తానికి మారుతి తన స్టైల్లో హడావిడిగా ఓ 30 రోజుల్లో సినిమాను చుట్టేశాడనిపిస్తోంది. మొత్తానికి తనకు అలవాటైన కామెడీ యాంగిల్స్‌తో, పిచ్చి పిచ్చి డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రెచ్చిపోయాడనిపిస్తోంది. మారుతి లేకి కామెడీనే తేడా కొట్టిందని అంటున్నారు. బిలో యావరేజ్ మూవీ అని ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి మంచి రోజులు వచ్చాయి.. కాస్త చెడ్డ రోజులుగా మారేట్టు కనిపిస్తోంది. ఈ ఎఫెక్ట్ మారుతి పక్కా కమర్షియల్ మీద కూడా పడేట్టు కనిపిస్తోంది.