• November 26, 2021

నా జీవితం, నా ప్రాణం!.. అసలు విషయం చెప్పిన రేణూ దేశాయ్

నా జీవితం, నా ప్రాణం!.. అసలు విషయం చెప్పిన రేణూ దేశాయ్

    Renu Desai రేణూ దేశాయ్ ఈ మధ్య ఎందుకో గానీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. ఒకప్పటిలా నిత్యం పోస్ట్‌లు చేయడం లేదు. అభిమానులతో టచ్‌లో ఉండటం లేదు. అయితే గత నెల రోజులకు పైగా ఎలాంటి అప్డేట్లు ఇవ్వడం లేదు. దీంతో రేణూ దేశాయ్‌కి ఏమైనా జరిగి ఉంటుందా? అని అభిమానులు ఆందోళన చెందారు. దీంతో మొన్నీ మధ్య ఓ పోస్ట్ చేసింది.

    తాను క్షేమంగా ఉన్నాను.. ఎలాంటి సమస్యల రాలేదు. కొద్దిగా సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుందామని దూరంగా ఉన్నానంటూ ఇలా రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. అయితే మధ్యలో మరో పోస్ట్ చేసింది రేణూ దేశాయ్. కానీ రెగ్యులర్‌గా మాత్రం అప్డేట్లు ఇవ్వడం లేదు. అయితే తాజాగా రేణూ దేశాయ్ తన కూతురి మీదున్న ప్రేమను మరోసారి ప్రపంచానికి తెలియజేసింది.

    తల్లీకూతుళ్ల ప్రేమ ఎలా ఉంటుందో మరోసారి చూపించింది. ఆద్య మీద తనకున్న ప్రేమను చాటింది. నా గుండె, నా ప్రాణం నా లోపల ఉండకుండా ఇలా బయట తిరుగుతోంది అని చెప్పుకొచ్చింది. ఆమె నా సూర్యోదయం, నా వెలుగు, నా ప్రపంచం.. నా బయట నా గుండె తిరుగుతోంది అని ఆద్య గురించి రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.

    రేణూ దేశాయ్ గత రెండేళ్లుగా రైతుల మీద సినిమా తీయాలని ప్రయత్నిస్తూనే ఉంది. కానీ కరోనా వల్ల ఆలస్యమవుతోంది. ఇక ఆద్య అనే మరో వెబ్ సిరీస్ కూడా మొదలుపెట్టింది. కానీ కరోనాతో ఆ ప్రాజెక్ట్ కూడా మూలకు పడింది.

    Leave a Reply