• December 5, 2021

Akira Nandan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ.. మూసుకున్న రేణూ దేశాయ్!

Akira Nandan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ.. మూసుకున్న రేణూ దేశాయ్!

    Renu Desai-Pawan Kalyan పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రేణూ దేశాయ్ మధ్య ఎప్పుడూ ఓ సన్నటి తీగలాంటి దూరం ఉంటుంది. వదిన అంటూ ఎంతో ఆప్యాయంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ రేణూ దేశాయ్‌ను సంబోధిస్తుంటారు. అలా వదిన అని పిలిస్తే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ పవన్ కళ్యాణ్ పేరు పెట్టి తనను వదిన అంటే ఒప్పుకోనని రేణూ దేశాయ్ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చింది. అయినా కూడా పవన్ ఫ్యాన్స్ మాత్రం మారలేదు.

    అకీరా నందన్, ఆద్యల గురించి రేణూ దేశాయ్ పోస్ట్‌లు పెట్టిన ప్రతీ సారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్లతో హంగామా చేస్తుంటారు. అలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టే కామెంట్లకు ఒక్కోసారి రేణూ దేశాయ్‌కి చిర్రెత్తుకొస్తుంటుంది. దాంతో తన కామెంట్ సెక్షన్లను మూసుకుంటుంది. కామెంట్ చేసే ఆప్షన్లను క్లోజ్ చేసి పక్కన పడేస్తుంది.

    దీంతో ఏ చెత్త కామెంట్లు చేసేందుకు ఎవ్వరికీ ఆస్కారం ఉండదు. అలా నిన్న రేణూ దేశాయ్ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో అకీరా నందన్ ఎంతో స్టైల్‌గా పియానోను వాయించేస్తున్నాడు. ఇక నిన్న (డిసెంబర్ 4) రేణూ దేశాయ్ బర్త్ డే. తల్లి పుట్టిన రోజు సందర్బంగా అకీరా ఓ పాటను పియానో మీద ప్లే చేశాడు. తన పుట్టిన రోజు సందర్భంగా తనకు ఇష్టమైన పాటను పియానో మీద ప్లే చేయి అంటూ అకీరాను రేణూ దేశాయ్ కోరిందట.

    అలా మొత్తానికి పుట్టిన రోజు స్పెషల్‌గా అకీరా ఆ పాటను వాయించేశాడు. అలా బర్త్ డే గిఫ్ట్ ఇవ్వడంతో రేణూ దేశాయ్ ఎమోషనల్ అయింది. నా ఇద్దరు పిల్లలు ఈ జీవితంలో నాకు దొరికిన గొప్ప వరం, బహుమతి అంటూ మురిసిపోయింది. అయితే ఈ పోస్ట్‌కు మొదట కామెంట్ చేసే సౌలభ్యాన్ని రేణూ దేశాయ్ నెటిజన్లకు ఇచ్చింది.

    కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చతో రేణూ దేశాయ్ వాటిని మూసేసింది. అకీరాకు పవర్ స్టార్ లేబుల్ ఇవ్వడం, జూనియర్ పవర్ స్టార్ అని పిలుస్తుండటం రేణూ దేశాయ్‌కు నచ్చదన్న సంగతి తెలిసిందే. అందుకే ఇలాంటి కామెంట్ సెక్షన్‌ను క్లోజ్ చేసినట్టుంది.

    Leave a Reply