• January 11, 2022

Renu Desai : కరోనా బారిన పడ్డ అకీరా నందన్, రేణూ దేశాయ్

Renu Desai : కరోనా బారిన పడ్డ అకీరా నందన్, రేణూ దేశాయ్

    Renu Desai Akira nandan కరోనా మహమ్మారి ఇప్పుడు ఎంతలా విజృంభిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజుకురోజుకూ లక్షల కేసులు నమోదవుతున్నాయి. దీనిక తోడు ఒమిక్రాన్ కూడా ప్రబలుతోంది. అయితే ఈ థర్డ్ వేవ్ ఎక్కువగా టాలీవుడ్ మీద ప్రభావం చూపుతోంది. వరుసగా సెలెబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ టాప్ స్టార్స్ కరోనా పాజిటివ్ అని తేలారు.

    ఇక పక్క భాషలో హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు కూడా కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు,తమన్, మంచు లక్ష్మీ, కుష్బూ, శోభన, త్రిష, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్ అనేక మంది పీఆర్వోలు కూడా కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. రేణూ దేశాయ్, అకీరా నందన్‌లు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తాజాగా రేణూ దేశాయ్ ప్రకటించింది.

    మేం అంతా కూడా ఇంట్లోనే ఉన్నాం. న్యూ ఇయర్‌కి కూడా ఇంట్లోనే ఉన్నాం. కానీ మేం గత కొన్ని రోజుల క్రితమే కరోనా బారిన పడ్డాం. పాజిటివ్ అని మాకు ఫలితం వచ్చింది. మేం ప్రస్తుతం ఇద్దరం కూడా రికవరీ అవుతున్నాం. ఈ థర్డ్ వేవ్‌ని అందరూ సీరియస్‌గా తీసుకోండి. మాస్కులు ధరించండి.. వీలైనంత వరకు జాగ్రత్తగానే ఉండండి.

    గత ఏడాది నేను రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నాను. అకీరాకు కూడా ఇప్పించాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు పాజిటివ్ అని తేలింది అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ పోస్ట్ చేసిన వెంటనే కామెంట్ సెక్షన్లను క్లోజ్ చేసింది. మళ్లీ అకీరా గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశ్నలతో విసిగిస్తారని ఇలా కామెంట్ సెక్షన్‌ను క్లోజ్ చేసి ఉండొచ్చు.

    Leave a Reply