- November 3, 2021
దొంగగా మారిన రవితేజ.. ఇంట్రెస్టింగ్ న్యూస్

రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను చేస్తున్నాడు. తాజాగా తన 71వ సినిమాకు సంబంధించిన ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చింది. ఇందులో భాగంగా రవితేజ దొంగగా కనిపించబోతోన్నాడు.స్టువర్ట్ పురంలోని గజ దొంగ జీవిత చరిత్ర ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. టైగర్ నాగేశ్వర రావు అంటూ రాబోతోన్న ఈ సినిమా 1970 బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనుంది. గత మూడేళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట.
తాజాగా ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పవర్ ఫుల్ రోల్‌ను పోషించేందుకు రవితేజ పూర్తిగా తన శరీరాకృతిని మార్చుకున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేస్, యాసతో రవితేజ ఆకట్టుకోబోతోన్నట్టు కనిపిస్తోంది. టైటిల్ పోస్టర్లో రవితేజ పిక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. నరాలు అలా మెలితిరిగి కనిపిస్తున్నాయి. రైలు వెంబడి పరిగెత్తుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి గజదొంగగా రవితేజ అందరినీ భయపెట్టబోతోన్నాడు.
Euphoric to announce my next with @RaviTeja_offl garu 🤩
There were thieves, robbers & then there was #𝐓𝐢𝐠𝐞𝐫𝐍𝐚𝐠𝐞𝐬𝐰𝐚𝐫𝐚𝐑𝐚𝐨 🐅#RT71 Begins Soon💥@abhishekofficl @gvprakash @madhie1 @kollaavinash @SrikanthVissa @MayankOfficl @AAArtsOfficial pic.twitter.com/GbsqxcXJpo
— VAMSEE (@Vamsee_dir) November 3, 2021
పాన్ ఇండియా అంటూ రవితేజ మొదటిసారిగా ప్రయోగం చేయబోతోన్నాడు. ఇందులో హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ఉండోబోతోన్నాయి. ఈ కథ 70వ దశకంలో జరుగడటం, అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించేందుకు ఆర్ మధి కెమెరామెన్‌గా ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ కథ మీదున్న నమ్మకంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో నిర్మించేందుకు నిర్మాతలు సిద్దమయ్యారు. రవితేజకు ఇదే మొదటి పాన్ ఇండియన్ సినిమా అవుతుంది. తెలుగు,తమిళ, కన్నడ మళయాల హిందీ భాషల్లో ఈ చిత్రం రానుంది. తేజ్ అగర్వాల్ నారాయణ్ సమర్ఫణలో అభిషేక్ అగర్వాల్ఆర్ట్స్ బ్యానర్ మీద అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.