• October 26, 2021

ఒక్కోసారి ఏం చేస్తున్నానో అర్థం కాదు!.. రష్మిక మందన్నా కామెంట్స్ వైరల్

ఒక్కోసారి ఏం చేస్తున్నానో అర్థం కాదు!.. రష్మిక మందన్నా కామెంట్స్ వైరల్

    నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కొంటె చేష్టలకు అభిమానులు ఫిదా అవుతుంటారు. తెరపైనా అల్లరి చేసే రష్మిక సోషల్ మీడియాలోనూ అంతే అల్లరి చేస్తుంటుంది. తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. తనకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్‌తో రష్మిక అందరినీ పలకరిస్తూ ఉంటుంది. అలాంటి రష్మిక ఇప్పుడు శ్రీవల్లిగా అందరినీ మైమరిపించేందుకు వస్తోంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రాబోతోన్న పుష్ప సినిమాకు సంబంధించిన అప్డేట్ల మోత మోగిపోతోంది.

    పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి అనే పాత్రలో కనిపిస్తోంది. ఇప్పటికే శ్రీవల్లి పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ఓ క్లారిటీ అందరికీ వచ్చింది. శ్రీవల్లి పాత్రను రివీల్ చేస్తూ వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ మధ్య వదిలిన శ్రీవల్లి సాంగ్ అయితే ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. శ్రీవల్లి అంటూ ప్రతీ ఒక్కరూ హమ్ చేసేస్తున్నారు.ఆ హ్యాంగవుట్‌లోంచి ఇంకా ఎవ్వరూ బయటకు రాక ముందే మరో పాటను వదిలేందుకు చిత్రయూనిట్ రెడీ అయింది.

    సామీ సామీ అంటూ రష్మిక, అల్లు అర్జున్‌లో మధ్యలో రాబోతోన్న ఈ పాట ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ పాట సందర్భంగా రష్మిక కొన్ని కామెంట్లు చేసింది. తాను ఈ చిత్రం చేస్తున్నందుకు, ఈ పాత్రను పోషిస్తున్నందుకు ఎంత సంతోషపడుతోందనేది చెప్పేసింది. ఒక్కోసారి మనం ఏం చేశాం, ఏం చేస్తున్నామని ఆశ్చర్యపోతుంటాం.

    కొత్త కొత్త పాత్రలను పోషించడం ఎంతో ఆనందంగా ఉంటుంది. విభిన్న మనస్తత్వాలు ఉన్న మనుషుల మధ్య నటించడం కొత్త అనుభూతి, ఇది నేను కాదు.. శ్రీవల్లి.. నేను ఆమెలా నటిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.. ఎందుకంటే ఆమె మామూల్ది కాదు. చూస్తూనే ఉండండి. నాకు అనిపించింది చెప్పేశాను అంతే.. అంటూ రష్మిక పోస్ట్ చేసింది. సామీ సామీ అనే ఈ పాట అక్టోబర్ 28న ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు విడుదల కానుంది.

    Leave a Reply