• November 22, 2021

అర్దరాత్రి ఆ పనులు నాలాంటి వాళ్లే చేస్తారు : రష్మిక మందన్నా

అర్దరాత్రి ఆ పనులు నాలాంటి వాళ్లే చేస్తారు : రష్మిక మందన్నా

    రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తనకంటూ ఓ టైంను కేటాయించుకుంటుంది. తన వర్కట్లు, తన ఫిట్ నెస్ అంటూ తన డైలీ రొటీన్ పనులను మాత్రం చేస్తుంటుంది. అర్దరాత్రి అయినా సరే తన పనులన్నీ పూర్తి చేసుకుని పడుకుంటుంది. ఇక తన ఆరాతో కలిసి కచ్చితంగా కాస్త టైం గడపాల్సిందే. అయితే తాజాగా రష్మిక అర్దరాత్రి వరకు ఆటలు ఆడుతూ వచ్చిందట.

    మామూలుగా అయితే రష్మిక మందన్నా తన షూటింగ్‌లు అన్నీ పూర్తి చేసుకుని రాత్రికి ఇంటికి వస్తుంది.అలా ఇంటికి వచ్చాక వర్కవుట్లు చేసి, ఆరాతో కాసేపు ఆడుకుని పడుకుంటుంది. కానీ నిన్న సండే కాబట్టి కాస్త మారినట్టుంది. అర్దరాత్రి వరకు ఆటలు ఆడుతూ ఫుల్ బిజీగా ఉండిపోయిందట. ఆటలన్నీ అయిపోయాక రాత్రి ఇంకా చెమటలు పట్టే పని చేసిందట. మొత్తానికి వర్కవుట్లును అర్దరాత్రి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

    అసలే ఈ మధ్య ట్రేడ్ మిల్ కూడా కొనేసింది. ఇంట్లోనే పెట్టేసుకుందట. అయితే అర్దరాత్రి ఇలా రన్నింగ్ చేసేది నాలాంటి సైకోలు మాత్రమే.. మొత్తానికి ఇలా చెమటలు పట్టడం మాత్రం మంచిదేనని రష్మిక చెప్పుకొచ్చింది. రష్మిక ప్రస్తుతం పుష్ఫ, ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో గుడ్ బై, మిషన్ మజ్ను అంటూ రెండు మూడు సినిమాలను చేస్తోంది.

    ఈ మధ్య ఓ రూమర్ కూడా బయటకు వచ్చింది. అందులో ఎంత నిజముందో తెలియదు. కానీ చిరంజీవి వెంకీ కుడుముల కాంబినేషన్‌‌లో సినిమా ఫిక్సయిందనీ, అందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోందనే టాక్ వచ్చేసింది.

    Leave a Reply