• January 10, 2022

నేను ఎవ్వరినీ చంపాలనుకోవడం లేదు : రష్మిక మందాన్న

నేను ఎవ్వరినీ చంపాలనుకోవడం లేదు : రష్మిక మందాన్న

    rashmika Mandanna రష్మిక మందాన్న సోషల్ మీడియాలో అభిమానులతో కలిసి చేసే అల్లరి మామూలుగా ఉండరు. రష్మిక నిత్యం తన అభిమానులో కలిసి చిట్ చాట్ చేస్తుంటుంది. ఫ్యాన్స్‌తె టచ్‌లోఉండేందుకే రష్మిక ప్రయత్నిస్తుంటుంది. షూటింగ్‌లు లేకుండా ఇంట్లోఖాళీగా ఉంటే కచ్చితంగా తన అభిమానులతో ముచ్చటిస్తుంది. ఏదో ఒక ప్రశ్న వేసి క్విజ్ లాంటిది పెడుతూ ఉంటుంది.

    రష్మిక ఇక ఆదివారం నాడు కాస్త రెస్ట్ తీసుకున్నట్టుంది. ఆదివారం ఇంట్లోనే ఉండటం బోర్ కొట్టి ఉంటుంది. వెంటనే తన ఇన్ స్టాలో అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్‌లాంటిది పెట్టేసింది. మీ మైండ్‌లో ఏమైనా ఉందా? అడిగేయండనే టైపులో పెట్టేసింది. ఏం చేయాలో కూడా నాకు సలహా ఇవ్వండని అడిగేసింది. దీంతో ఒక్కొక్కరు ఒక్కో రకంగా సలహాలు ఇచ్చారు.

    పెట్స్‌తో ఆడుకోండి అని ఒక నెటిజన్ అంటే.. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను అని చెప్పింది. బీటీఎస్ సాంగ్స్ వినండి.. వాటికి డ్యాన్స్ చేయండి. ఆ వీడియోలను షేర్ చేయండని అడిగింది. పాటలు విన్నాను, డ్యాన్స్ చేశాను కానీ పోస్ట్ చేయను అని చెప్పింది. అలా ఒక్కో నెటిజన్ ఒక్కో రకంగా సలహా ఇచ్చాడు. చివరకు ఓ నెటిజన్ మాత్రం వంట చేయండి అని సలహా ఇచ్చాడు.

    ఇక వంటచేసి నేను ఎవ్వరినీ చంపాలని అనుకోవడం లేదంటూ రష్మిక సెటైర్ వేసింది. కానీ రష్మికకు కుకింగ్ వచ్చు. అన్నీ పర్ఫెక్ట్‌గా చేయలేదు. కానీ ఆమ్లేట్ మాత్రం బాగానే చేయగలదట.ఈ విషయాన్ని గత ఏడాది లాక్డౌన్ సమయంలో రష్మికనే చెప్పేసింది. తమ ఆహారపు అలవాట్ల గురించి చెబితే కుకింగ్ గురించి రష్మిక చెప్పుకొచ్చింది.

    Leave a Reply