- December 14, 2021
The Voice Of Ravanna : చలో చలో పరిగెత్తు.. రానా విప్లవగీతం

హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి సాయి పల్లవి కలిసి విరాట పర్వం అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది వరకు ఎన్నడూ పోషించిన పాత్రలో రానా కనిపించబోతోన్నారు. ఇది వరకు విడుదల చేసిన విరాట పర్వం టీజర్, ఫస్ట్ సింగిల్‌కు విశేషమైన స్పందన లభించింది.
1990 నాటి ప్రాంతంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా నటిస్తున్నారు. అతని కలం పేరు అరణ్య. రవన్నను ఆరాధించే అమ్మాయిగా వెన్నెల కారెక్టర్‌లో సాయి పల్లవి నటించారు. యుద్ద నేపథ్యంలో అందమైన ప్రేమ కథను ఈ విరాట పర్వం సినిమాలో చూపించబోతోన్నారు.
రానా బర్త్ డే సందర్బంగా వాయిస్ ఆఫ్ రవన్న అంటూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఇక ఇందులో రవన్న ఇచ్చిన ప్రసంగం అందరినీ ఉత్తేజ పరిచేలా ఉంది. ఈ వీడియోలో రానా ప్రయాణం, యుద్దం మధ్యలో సాయి పల్లవితో ప్రేమాయణం, విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సంక్రాంతికి ట్రైలర్ రాబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు.
Listen to 'The Voice Of Ravanna' from #VirataParvam Tomorrow at 10:10 a.m. 🔥#HappyBirthdayRanaDaggubati @RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm #SureshBobbili @dancinemaniac @nanditadas @Naveenc212 @laharimusic @SLVCinemasOffl pic.twitter.com/1R732jwXhU
— Suresh Productions (@SureshProdns) December 13, 2021
‘మారదులే.. ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే.. రౌద్రపు శత్రువు దాడిని ఎదురించే పోరాటం మనదే.. చలో చలో చలో పరిగెత్తు.. అడుగే పిడుగై రాలేలా గుండెల దమ్ముని చూపించు.. చలో చలో పరిగెత్తు.. చీకటి మింగిన సూర్యుని తెచ్చి తూర్పు కొండని వెలిగిద్దాం.. పొంగిన వీపుల బరువులు దించి విప్లవ గీతం వినిపిద్దాం. చలో చలో పరిగెత్తు.. దొరొల్ల తలుపుల తాళంలా.. గఢీల ముంగట కుక్కల్లా.. ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు.. చలో పరిగెత్తు.. చలో పరిగెత్తు’ అంటూ రవన్న పాత్రలో రానా చెప్పిన డైలాగ్స్ హైలెట్ అవుతున్నాయి.
డి సురేష్ బాబు సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. డానీ సాంచేజ్ లొపేజ్, దివాకర్ మణి కెమెరామెన్‌లుగా పని చేశారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరీ రావ్, సాయి చంద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.