- November 15, 2023
కుర్చీ మడతపెట్టి.. రామజోగయ్య శాస్త్రి ట్వీట్ వైరల్.. శాంతస్వరూపుడికి కోపమొచ్చిన వేళ

టాలీవుడ్ ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. తన ఫాలోవర్లతో చిట్ చేస్తుంటారు. అభిమానులు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. తన మీద వచ్చే విమర్శలకు సైతం ఎంతో హుందాగా రిప్లైలు ఇస్తుంటారు. ఇక రామజోగయ్య శాస్త్రి రాసే పదాలకు జనాలు ఫిదా అవుతుంటారు. కొత్త పాట వచ్చినప్పుడు, అందులో రామ్‌జో రాసిన సాహిత్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ.. ట్విట్టర్‌లో ఆ సాహిత్యాన్ని పంచుకుంటూ ఉంటారు అభిమానులు.
అలా తన సాహిత్యాన్ని తనకే పంపుతూ ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుందని రామ్‌జో చెబుతుంటారు. అలా తన ఫాలోవర్లతో ఎప్పుడూ ప్రేమగా, శాంతంగా మాట్లాడుతూ ఉంటారు. సమాాధానాలు ఇస్తుంటారు. అలాంటి శాంతస్వరూపుడికి ఇప్పుడు ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్టుగా ఉంది.
గుంటూరు కారం కోసం ధమ్ మసాలా అనే పాటను రామ్‌జో రాశారు. ఆ పాటలోని లిరిక్స్‌కు అంతా ఫిదా అయ్యారు, ఇంకా ఎంతో రాశానని, కానీ కావాల్సినంతే తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఆ పాటను పాడుతూ ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశారు రామ్‌జో. ఆ వీడియో మీద ఓ ఆకతాయి కాస్త హద్దులు దాటి రిప్లై ఇచ్చాడు.
🪑🪑🪑🪑🪑🪑🪑🪑 https://t.co/UgDGV7LU5q
— RamajogaiahSastry (@ramjowrites) November 15, 2023
పాటలు రాయండి.. పాడకండి అంటూ కౌంటర్లు వేశాడు ఆకతాయి. దీనికి రామ జోగయ్య శాస్త్రి అందరూ అదిరిపోయేలా, నోరెళ్లబెట్టేలా రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు రీల్స్, ఇన్ స్టా ఇలా అన్నింట్లోనూ ఒకటే డైలాగ్ ట్రెండ్. కుర్చీ మడతపెట్టి అంటూ వచ్చే డైలాగ్ గురించి, ఆ తరువాత వచ్చే పదం గురించి ప్రత్యేకంగా చెపాల్సిన పని లేదు. ఆ కుర్చీ తాత చెప్పిన స్టైల్లోనే రామ్‌జో కూడా చెప్పినట్టుగా అనిపించింది. కుర్చీ ఎమోజీలను షేర్ చేశారు. తన భావాన్ని చెప్పకనే చెప్పారు. రామజోగయ్య శాస్త్రి ఇలాంటి రిప్లైలు కూడా ఇస్తారా? ఇలా కూడా ఇస్తారా? అంటూ అందరూ షాక్ అవుతున్నారు.