• July 26, 2022

Ram Pothineni: ఫ్లాప్ వచ్చినా కూడా తగ్గించడం లేదే.. రామ్ రెమ్యూనరేషన్‌పై చర్చ

Ram Pothineni: ఫ్లాప్ వచ్చినా కూడా తగ్గించడం లేదే.. రామ్ రెమ్యూనరేషన్‌పై చర్చ

    Ram Pothineni ఇస్మార్ట్ హీరో రామ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన దాఖలాలు లేవు. హిట్లు లేక ఎన్నో ఏళ్లు సతమతమయ్యాడు. అలాంటి రామ్‌కు ఇస్మార్ట్ శంకర్ ఊపిరి పోసింది. అటు రామ్‌కు, ఇటు పూరికి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ ఇద్దరి కెరీర్‌లు ఆ సినిమాతో నిలబడ్డాయి. రామ్‌కు మాస్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. చివరకు ఉస్తాద్ రామ్ అయ్యాడు.

    అయితే రామ్ నటించిన RED, ది వారియర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినా కూడా రెమ్యూనరేషన్ మాత్రం తగ్గించడం లేదట. నెక్ట్స్ బోయపాటితో రామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందు కోసం రామ్, బోయపాటి ఇద్దరి రెమ్యూనరేషన్లే నలభై కోట్లు అవుతున్నాయట. రామ్, బోయపాటి చెరో రూ. 20 కోట్లు తీసుకుంటున్నారట.

    ఇక ఈ ఇద్దరి రెమ్యూనరేషన్‌లే ఇలా ఉంటే.. బడ్జెట్ కచ్చితంగా వంద కోట్లు దాటుతుంది. కానీ అది రికవరీ అవుతుందా? లేదా? అన్నది మాత్రం అనుమానంగా మిగులుతుంది. ఎందుకంటే రామ్‌కు వంద కోట్ల మార్కెట్ లేదు. బోయపాటి సైతం ఆ రేంజ్‌కు వెళ్లలేదు. అఖండ అయితే బాలయ్య బోయపాటి కాంబోతో ఆ రేంజ్ సక్సెస్ అయింది. కానీ రామ్ బోయపాటి అంటే వంద కోట్ల మార్క్ టచ్ అవుతుందా? లేదా? అన్నది అనుమానమే. మొత్తానికి టాలీవుడ్‌లో హీరోలు, దర్శకుల రెమ్యూనరేషన్‌లు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.

    Tollywood Producers: రోగానికి, చిక్సితకు సంబంధం లేదు!.. టాలీవుడ్ నిర్మాతల తెలివి ఎటు పోయింది?