- December 16, 2021
Ram Charan : దటీజ్ రామ్ చరణ్.. సైలెంట్‌గా అభిమానికి చెప్పేసిన చెర్రీ!

Ram Charan Pet Brat మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండదు. తన సినిమా లోకంలో ఉంటూ ఫ్యామిలీ ఈవెంట్లలోనే ఎక్కువగా గడుపుతుంటాడు. అవేవీ లేవంటే.. అభిమానులు, వారు చేసే సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల మీద దృష్టి పెడుతుంటాడు. అయితే తాజాగా రామ్ చరణ్ తన అభిమాని కోసం సైలెంట్‌గా ఓ ట్వీట్ వేశాడు.
నెట్టింట్లో రామ్ చరణ్ ఎక్కువ యాక్టివ్‌గా ఉండడని అంతా అనుకుంటారు. కానీ అది అబద్దమని తాజాగా రుజువైంది. అందరికీ రిప్లైలు మాత్రం ఇవ్వలేకపోవచ్చు. కానీ అభిమానుల కామెంట్లను మాత్రం ఎప్పటికప్పుడు చదువుతుంటాడు.. వాటికి ఎలా రిప్లై ఇవ్వాలో అలా రిప్లై ఇస్తాడు. తాజాగా అదే విషయం రుజువైంది. ఓ అభిమాని రామ్ చరణ్‌కు ఓ రిక్వెస్ట్ పెట్టాడు.
రామ్ చరణ్ జంతు ప్రేమికుడున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఇంట్లో, ఫాం హౌస్‌లో ఎన్నో పెట్స్ ఉన్నాయి. గుర్రాలు కూడా ఉన్నాయి. ఇక రామ్ చరణ్‌కు పెట్స్ అంటే మహా ప్రాణం. అందులో బ్రాట్ అనే పెట్ గురించి అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటాడు. గత కొన్ని రోజులుగా బ్రాట్ గురించి రామ్ చరణ్ ఎలాంటి అప్డేట్లు ఇవ్వలేదు. దీంతో బ్రాట్‌కు ఏమైంది అన్న అంటూ ఓ అభిమాని ఆందోళన చెందాడు.
Fan Action Hero Reaction@AlwaysRamCharan ❤ pic.twitter.com/mrp3spRd1r
— KD_®©_ (@Alwayz_KDR) December 15, 2021
అయితే రామ్ చరణ్ మాత్రం సైలెంట్‌గా ఆ కామెంట్ చదివేసి చెప్పాల్సిన విషయాన్ని మాత్రం సదరు అభిమానికి తెలిసేలా చేశాడు. తన ఎఫ్ బీ స్టోరీలో తన పెట్స్‌తో ఆడుకుంటున్న ఫోటోలను షేర్ చేశాడు. అందులో మరీ ముఖ్యంగా బ్రాట్ ఇదిగో అంటూ మెన్షన్ చేసి చూపించాడు. దీంతో సదరు అభిమాని ఫుల్ ఖుషీ అయ్యాడు. మొత్తానికి రామ్ చరణ్ మాత్రం తన అభిమానులను ఎలా చూసుకుంటాడో అర్థమైంది. వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతాడని మరోసారి రుజువైంది.