• November 7, 2021

ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే వస్తారు!.. సుమ రేంజ్ అదేనన్న రామ్ చరణ్

ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే వస్తారు!.. సుమ రేంజ్ అదేనన్న రామ్ చరణ్

    టాలీవుడ్‌లో యాంకర్ సుమకు ఉన్న రేంజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుంచి ప్రతీ ఒక్క సీనియర్ హీరో, జూనియర్ హీరోల వరకు సుమ తన పలుకుబడిని వాడగలదు. ఎవరితోనైనా సరే ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటుంది. సుమ సాయం అడిగితే చేసేందుకు ఎంత పెద్ద హీరో అయినా సరే రావాల్సిందే. వస్తారు కూడా. ఎందుకంటే సుమ వల్ల ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎంతో సాఫీగా, ఆహ్లాదకరంగా సాగుతుంటాయి.

    సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిందంటే.. అది పెద్ద సినిమా. సుమ లేకపోతే అదేదో అడపాదడపా ఈవెంట్ అనే రేంజ్‌కు ప్రేక్షకులు వచ్చేశారు. అలా సుమ పాపులారిటీ ఇండస్ట్రీలో, బుల్లితెరపై, సోషల్ మీడియాలో పెరుగుతూనే వస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితం వెండితెరను వదిలిపెట్టి.. బుల్లితెరకు వచ్చి సెటిలైంది. అలాంటి సుమ మళ్లీ వెండితెరపై కనిపించబోతోంది.జయమ్మ పంచాయితీ అంటూ మెయిన్ రోల్‌లో సుమ కనిపించబోతోంది.ద

    ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇలా అందుబాటులోకి వచ్చారు.. చాలా థ్యాంక్స్ చరణ్ అంటూ సుమ అనేసింది. నేను మామూలుగానే మా మీడియా వాళ్లు పిలిస్తే కూడా వెళ్లను. కానీ మీరు ఫోన్ చేశారని తెలియగానే.. వెంటనే ఎక్కడ ఏంటి? అని అడిగేశాను. వెంటనే స్క్రిప్ట్ పంపించండి.. ఫ్లైట్‌లోనే చదివేస్తాను అని అన్నాను. మీరు అంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టం. నేను అనే కాదు. ఇండస్ట్రీలో ఏ హీరో అయినా, డైరెక్టర్ నిర్మాతలు అయినా సరే మీరు పిలిస్తే కచ్చితంగా వస్తారు అని సుమ గురించి రామ్ చరణ్ ఎంతో గొప్పగా చెప్పేశాడు.

    Leave a Reply