- November 16, 2025
భక్తుల్ని హర్ట్ చేసిన రాజమౌళి కామెంట్స్

దేవుడ్ని నమ్మేవాళ్లుంటారు.. నమ్మని వాళ్లుంటారు.. కానీ ఈ నమ్మని వాళ్లు చేసే కామెంట్లతో నమ్మేవాళ్ల మనోభావాలు దెబ్బతింటుంటాయి. రాజమౌళి నిన్నటి ఈవెంట్‌లో చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదానికి దారి తీస్తున్నాయి. ఈవెంట్‌లో ప్లే చేయాల్సిన వీడియోలో సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఎంతకీ ఆ వీడియో ప్లే కావడం లేదు.. టెక్నికల్ గ్లిచెస్ వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.
దీంతో రాజమౌళి ఎమోషనల్ అయ్యాడు. నేను దేవుడ్ని పెద్దగా నమ్మను కానీ.. మా నాన్న, మా ఆవిడ మాత్రం హనుమాన్‌ను నమ్ముతారు.. మీ హనుమని నమ్మితే ఇలానేనా జరిగేది.. ఎందుకు ఇలా జరిగింది.. వెనకాల ఉంటాడు.. గుండె తట్టి నడిపిస్తారని అన్నారు కదా.. నాకు కోపం వచ్చింది అంటూ ఇలా రాజమౌళి ఎమోషనల్ అవుతూ కామెంట్లు చేశాడు.
మరి వీటిపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టెక్నికల్ సమస్యలు ఎవ్వరికి అయినా కామన్ అయితే.. వాళ్లు తమ తమ దేవుళ్లను నిందిస్తారా?.. మీ కామెంట్లు మమ్మల్ని హర్ట్ చేశాయ్.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి వీటిపై రాజమౌళి రియాక్ట్ అవుతాడో లేదో చూడాలి.