• November 9, 2021

RRR : జక్కన్నే లీక్ చేశాడు!.. ఇక థియేటర్లో పూనకాలే

RRR : జక్కన్నే లీక్ చేశాడు!.. ఇక థియేటర్లో పూనకాలే

    రాజమౌళి సినిమాల్లోని సీన్స్, ఎలివేషన్స్, డైలాగ్స్ ఇలా అన్నీ కూడా అందరికీ రిజిష్టర్ అయిపోతాయి. ముఖ్యంగా హీరోలు చెప్పే డైలాగ్స్, హీరో ఇంట్రడక్షన్‌లో వచ్చే ఎలివినేషన్, వాటికి సంబంధించిన డైలాగ్స్ థియేటర్లో విజిల్స్ వేయిస్తుంటాయి. అలా ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి ఎంత జాగ్రత్తగా చెక్కి ఉంటాడో అందరూ ఊహించుకోవచ్చు. అసలే రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు హీరోలున్నారు ఈ ఇద్దరిని బాలెన్స్ చేయడం అంత సులభమైన పని కాదు.

    అలాంటి ఇద్దిరినీ బాలెన్స్ చేస్తూ సినిమా తెరకెక్కించాడు మన జక్కన్న. సినిమాను ఎలా తీసి ఉంటాడు.. ఎవరిని ఎలా చూపించి ఉంటాడు.. ఎవరి కారెక్టర్ ఎలా ఉండబోతోంది. ఎవరికి ఎక్కువ స్పేస్ దక్కి ఉంటుంది. ఎవరి ఇంట్రడక్షన్ సీన్లు అదిరిపోతాయి. ఎలివేషన్లు ఎవరికి ఎక్కువగా ఇచ్చాడు అనే లెక్కలు అభిమానులు వేస్తుంటారు. అభిమానులు అలా ఆలోచిస్తుంటారని రాజమౌళి ముందే వాటన్నంటిని బేరీజు వేసుకుని ఉంటాడు. తాజాగా రాజమౌళి ఈ చిత్రంలోనే ఓ డైలాగ్ లీక్ చేసేశాడు.

    మనం చేసేది ధర్మ యుద్దం అయినప్పుడు.. ఆయుధాలు వాటంతటవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయ్ అని ఓ డైలాగ్ ఉంటుందట. ఈ మధ్యే రాజమౌళి ఓ ఈవెంట్‌లో పాల్గొని ఈ డైలాగ్‌ను చెప్పేశాడు. అయితే ఈ డైలాగ్ ఎవరు ఎవరికి చెప్పి ఉంటారు.. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లలో ఎవరు ఈ మాటలను వాడి ఉంటారు అని ఇప్పటి నుంచి అభిమానులు ఊహించుకుంటున్నారు. ఇలా ఒక్క డైలాగ్ మాత్రమే రివీల్ చేసి అందరినీ ఆలోచనల్లో పడేశాడు. సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కోసం ఇంకా ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ రాసినట్టు తెలుస్తోంది.

    Leave a Reply