• December 10, 2021

RRR Trailer : కుమ్మేసిన చెర్రీ, తారక్.. ‘బాహుబలి 2’ రికార్డులు మాత్రం!

RRR Trailer : కుమ్మేసిన చెర్రీ, తారక్.. ‘బాహుబలి 2’ రికార్డులు మాత్రం!

    RRR Trailer 24 Hours Records రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సత్తా ఏంటో నిన్న అందరూ చూశారు. నిన్న ఉదయం పది గంటలకు దేశంలోని అన్ని థియేటర్లలో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ తరువాత గంటకే సోషల్ మీడియాలో వదిలారు. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఒక్క రోజులో క్రియేట్ చేసిన రికార్డుల గురించి ఇప్పుడు చర్చ ఎక్కువగా నడుస్తోంది

    వ్యూస్, లైక్స్ విషయంలో ఆర్ఆర్ఆర్ ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందా? అని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పూర్తి రిపోర్ట్ మీ ముందుకు తీసుకొచ్చాం. ముందుగా తెలుగు ట్రైలర్ లెక్కలేంటో చూద్దాం. ఈ తెలుగు ట్రైలర్ 24 గంటల్లో 20.45 మిలియన్ల వ్యూస్, 1.24 మిలియన్ల లైకులను సొంతం చేసుకుంది.

    అయితే వ్యూస్ విషయంలో టాప్ 2లో ఉండగా.. లైక్స్ విషయంలో మాత్రం నెంబర్ వన్ స్థానాన్ని చేరుకుంది. ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. బాహుబలి 2 ట్రైలర్ రికార్డులను బద్దలు కొట్టలేకపోయింది. బాహుబలి 2 సినిమా ట్రైలర్‌కు 24 గంటల్లో 21.81 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక రెండో స్థానంలో ఆర్ఆర్ఆర్, మూడో స్థానంలో వకీల్ సాబ్ ఇలా ఉన్నాయి.

    ఇక లైకుల విషయంలో మాత్రం ఆర్ఆర్ఆర్ ట్రైలర్ దుమ్ములేపేసింది. 1.24 మిలియన్ల లైకులతో వకీల్ సాబ్ ట్రైలర్ రికార్డులను బ్రేక్ చేసింది. బాహుబలి 2 ట్రైలర్‌కు కేవలం 497k లైక్స్ మాత్రం వచ్చాయి. ఇక మొత్తం దక్షిణాది విషయంలో అయితే బిగిల్ ట్రైలర్‌కు ఎక్కువ లైక్స్ ఉన్నాయి. 1.66 మిలియన్ల లైకులతో విజయ్ బిగిల్ సినిమా టాప్ ప్లేస్‌లో ఉంది.

    అదే సౌత్ మోస్ట్ వ్యూయ్డ్ ట్రైలర్‌లో బాహుబలి 2 ట్రైలర్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఆర్ఆర్ఆర్ రెండో స్థానంలో ఉంది. ఇక ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌కు 24 గంటల్లో ఏ ఏ భాషల్లో ఎన్నెన్ని వ్యూస్, లైక్స్ వచ్చాయో చూద్దాం. తెలుగు 20.45 మిలియన్ల వ్యూస్, 1.24 మిలియన్ల లైక్స్.. హిందీలో 19.8 మిలియన్ల వ్యూస్, 805k లైక్స్.. తమిళంలో 3.25 మిలియన్ల వ్యూస్, 206.2k లైక్స్.. కన్నడలో 5.2 మిలియన్ల వ్యూస్, 141.4k లైక్స్, మళయాలంలో 2.42 మిలియన్ల వ్యూస్, 180.4k లైక్స్ వచ్చాయి. అలా మొత్తంగా 51.12 మిలియన్ల వ్యూస్, 2.58 మిలియన్ల లైక్స్‌తో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ దుమ్ములేపేసింది.

    Leave a Reply